AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC NDA NA 2026 Jobs: త్రివిధ దళాల్లో కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. పూర్తి సెలక్షన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుందంటే?

దేశానికి సేవచేయాలనే తపన ఉన్న యువతకు యూపీఎస్సీ యేటా వివిధ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, నేవల్​ అకాడెమీల్లో ప్రవేశాలకు యూపీఎస్సీ ఎన్​డీఏ&ఎన్​ఏ 2026 (1) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంటర్మీడియట్​ విద్యార్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ పూర్తి చేసిన వారు గరిష్టంగా 8 సార్లు ఈ పరీక్ష రాయవచ్చు..

UPSC NDA NA 2026 Jobs: త్రివిధ దళాల్లో కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. పూర్తి సెలక్షన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుందంటే?
UPSC NDA NA Jobs Selection Process
Srilakshmi C
|

Updated on: Dec 18, 2025 | 8:40 AM

Share

దేశానికి సేవచేయాలనే తపన ఉన్న యువతకు యూపీఎస్సీ యేటా వివిధ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, నేవల్​ అకాడెమీల్లో ప్రవేశాలకు యూపీఎస్సీ ఎన్​డీఏ&ఎన్​ఏ 2026 (1) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంటర్మీడియట్​ విద్యార్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ పూర్తి చేసిన వారు గరిష్టంగా 8 సార్లు ఈ పరీక్ష రాయవచ్చు. 2026 NDA, NA (1) నోటిఫికేషన్‌లో మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్‌ అర్హతతోపాటు 1 జులై 2007 నుంచి 1 జులై, 2010 మధ్య జన్మించిన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌.. త్రివిధ దళాల్లో సేవలు అందించవచ్చు. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 30, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఉన్నత విద్యతోపాటు ఆకర్షణీయమైన జీతంతో దేశ రక్షణ రంగంలో సర్కార్ కొలువు మీ సొంతం అవుతుంది. ఈ క్రమంలో రాత పరీక్ష ఎలా ఉంటుంది? అసలు ఎంపిక పూర్తి ప్రాసెస్‌ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

యూపీఎస్సీ ప్రతీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, నేవల్​ అకాడెమీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల అనంతరం పుణెలో ఉన్న ఎన్​డీఏ అకాడెమీలో బీటెక్, బీఎస్సీ, బీఏ చదువుకుంటూనే ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఇక నేవల్ అకాడెమీ(ఎన్​ఏ)కి ఎంపికైతే కేరళలోని ఎజమాళలో బీటెక్​ కోర్సును అందిస్తారు. ఎన్డీయే, ఎన్‌ఏ కోర్సులకు ఎంపికైన వారికి పూర్తి ఉచితంగా విద్య, వసతి, భోజన సదుపాయాలు అందిస్తారు. ఈ ఆకాడమీల్లో చదువు పూర్తి చేసిన వారికి న్యూఢిల్లీలోని JNU డిగ్రీలను ప్రదానం చేస్తుంది. ఇలా డిగ్రీ పూర్తి చేసిన వారికి సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్​ శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో ప్రతినెలా రూ. 56,100 స్టైఫండ్​ చెల్లిస్తారు. ఈ శిక్షణ కూడా పూర్తిచేసిన వారికి ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్​ లెఫ్టినెంట్, ఎయిర్​ ఫోర్స్‌లో‌ ఫ్లయింగ్​ ఆఫీసర్ (పైలట్), గ్రౌండ్​ డ్యూటీ ఆఫీసర్ హోదాతో ఉద్యోగాలు పొందొచ్చు.

రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..

యూపీఎస్సీ ఎన్​డీఏ&ఎన్​ఏ 2026 (1) రాత పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. మొత్తం 900 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది. పేపర్​ 1లో మొత్తం 120 మ్యాథ్స్ ప్రశ్నలకు 300 మార్కులు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు కేటాయిస్తారు. ఇక పేపర్ 2లో మొత్తం 150 ప్రశ్నలకు 600 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. పేపర్​ 2లో పార్ట్ ఏ ఇంగ్లిష్ 200 మార్కులు. పార్ట్​ బీ జనరల్ నాలెడ్జ్ విభాగం ఉంటుంది. ఇందులో ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు, జనరల్​ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు, హిస్టరీ నుంచి 20 ప్రశ్నలు, భూగోళ శాస్త్రం 20 ప్రశ్నలు, కరెంట్‌ అఫైర్స్ నుంచి 10 ఆబ్జెక్టివ్​ ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింట్ ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానాలకు 1/3 వంతు చొప్పున కోత విధిస్తారు. ప్రతి సబ్జెక్టులోనూ కనీస మార్కులు అర్హత పొందాలి.

ఇవి కూడా చదవండి

ఇక రాత పరీక్ష అనంతరం ఇందులో అర్హత సాధించని వారికి సర్వీస్ సెలక్షెన్​ బోర్డు (ఎస్​ఎస్​బీ) ఆధ్వర్యంలో ఇంటలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులను 900 మార్కులకు యూపీఎస్సీ నిర్వహిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ కలిపి మొత్తం 1800 మార్కులకు సెలక్షన్లు జరుగుతాయి. ఇంటర్వ్యూ విభాగంలో గ్రూప్​ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, గ్రూప్ టెస్టులు, అవుట్‌ డోర్ గ్రూప్ టాస్కులు ఉంటాయి. వీటిని 2 అంచెలుగా 5 రోజులపాటు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్​ఎస్​బీ ఇంటర్య్వూలో సాధించిన మొత్తం మార్కుల మెరిట్​ ఆధారంగా తుది నియామకాలు ఉంటాయి.

గత ఏడాది అతి తక్కువ మార్కులతోనే ఎంపిక

కాగా 2025 సంవత్సరంలో చివరి విడతలో జరిగిన పరీక్షలో పరీక్ష, ఇంటర్వ్యూలకు కలిపి కేవలం 40 శాతం మార్కులు వచ్చిన వారికి కూడా అకాడెమీల్లో ప్రవేశాలు దక్కాయి. 2025 తొలి విడత పరీక్షలో 900కు గానూ 334 మార్కులు వచ్చిన వారు ఇంటర్య్వూకు అర్హత పొందారు. తుది ఎంపికలో చివరి అభ్యర్థికి 699 మార్కులు వచ్చినా సెలక్ట్ అయ్యారు. 2024లో తుది విడత పరీక్ష (2)లో 305 మార్కులు వచ్చిన వారు కూడా ఇంటర్య్వూకి అర్హత పొందారు. ఈ అభ్యర్ధి తుది ఎంపికలో ఇంటర్వ్యూతో కలిపి 673 మార్కులతో ఎంపికయ్యారు. అంటే మొత్తం 1800లకు 40 శాతం సాధిస్తే తదుపరి పరీక్షలకు ఎంపికవుతారు.

మరన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్మీ కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. సెలక్షన్‌ ఎలా ఉంటుందంటే?
ఆర్మీ కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. సెలక్షన్‌ ఎలా ఉంటుందంటే?
Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ