AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CLAT 2026 Counseling Schedule: క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?

CLAT 2026 toppers: దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిష్ఠాత్మక లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబరు 7న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌-2026) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం (CNLU)..

CLAT 2026 Counseling Schedule: క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
CLAT 2026 Counseling Schedule
Srilakshmi C
|

Updated on: Dec 18, 2025 | 7:09 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18: దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిష్ఠాత్మక లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబరు 7న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌-2026) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం (CNLU) డిసెంబరు 16న విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 92,344 మంది క్లాట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 96.83 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు, 92.45% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 94 శాతం మంది పరీక్ష రాశారు. హైదరాబాద్‌ నుంచి యూజీలో ఆరుగురు, పీజీలో ముగ్గురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. క్లాట్‌ యూజీలో బెంగళూరు నుంచి 15 మంది అత్యధిక ర్యాంకులు పొందారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఎనిమిది మంది, ముంబయిలో ఏడుగురు ఉన్నారు. టాపర్స్‌ లిస్టులో హైదరాబాద్‌ నాలుగోస్థానంలో నిలిచింది. యూజీలో రాజమహేంద్రవరం, విశాఖపట్నం నుంచి ఒక్కొక్కరు టాప్‌ 100లో ర్యాంకు సాధించారు.

క్లాట్‌ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 పీజీ ప్రవేశాల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన వేమిరెడ్డి నితిన్ చంద్ర జాతీయ స్థాయిలో 90వ ర్యాంక్ సాధించారు. ఈ పరీక్షలో మొత్తం 83.50 మార్కులు సాధించి ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా 5వ ర్యాంక్‌లో మెరిశారు. ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీలో తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం విశేషం. స్వేతాచలపతి సంస్థాన ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన నితిన్‌ చంద్ర విశాఖపట్నంలోని వెనిక్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఏపీ లాసెట్‌లో 14వ ర్యాంక్ సాధించి ఆంధ్రా యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీలో ప్రవేశం పొందారు. తాజాగా క్లాట్‌ 2026 పీజీలోనూ ర్యాంకు కొట్టి అందరి దృష్టి ఆకర్షించారు.

ఇవి కూడా చదవండి

CLAT 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

  • కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ తేదీలు: డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 27, 2025 రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం
  • మొదటి కేటాయింపు జాబితా విడుదల తేదీ: జనవరి 7, 2026న ఉదయం 10 గంటలకు
  • రెండవ కేటాయింపు జాబితా విడుదల తేదీ: జనవరి 22, 2026న ఉదయం 10 గంటలకు
  • మూడవ కేటాయింపు జాబితా విడుదల తేదీ: ఫిబ్రవరి 5, 2026న ఉదయం 10 గంటలకు
  • నాల్గవ కేటాయింపు జాబితా విడుదల తేదీ: 2 మే, 2026న ఉదయం 10 గంటలకు
  • తుది కేటాయింపు జాబితా విడుదల తేదీ: 2026 మే 15న ఉదయం 10 గంటలకు

మరన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నెలకు రూ.లక్షన్నర జీతంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా..
నడిరోడ్డులో అత్త కాళ్ళు పట్టుకుని వేడుకున్న అల్లుడు..!
నడిరోడ్డులో అత్త కాళ్ళు పట్టుకుని వేడుకున్న అల్లుడు..!
రైళ్లలో పరిమితికి మించి లగేజీపై ఛార్జీల మోత..!
రైళ్లలో పరిమితికి మించి లగేజీపై ఛార్జీల మోత..!
ఇథియోపియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..!
ఇథియోపియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..!
తొలి రోజు టాటా సియార్రాను ఎంత మంది బుక్‌ చేసుకున్నారో తెలుసా?
తొలి రోజు టాటా సియార్రాను ఎంత మంది బుక్‌ చేసుకున్నారో తెలుసా?