Bigg Boss 9 Telugu : షాకింగ్ ట్విస్ట్.. బిగ్బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు.. దూసుకొచ్చిన కంటెస్టెంట్..
బిగ్ బాస్ సీజన్ 9.. చివరి అంకానికి వచ్చింది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరోవైపు పీఆర్ టీమ్స్ సైతం తమ కంటెస్టెంట్స్ గెలిచేందుకు గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

బిగ్ బాస్ సీజన్ 9… ఈసారి విన్నర్ ఎవరు అవుతారనే విషయంపై విపరీతమైన బజ్ నెలకొంది. ముందు నుంచి తనూజ పేరు వినిపిస్తుండగా.. ఈమధ్య కాలంలో ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పడాల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5గా నిలిచారు డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల. ఆట తీరు.. టాస్కులలో అదరగొట్టేస్తూ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక తమ ప్రవర్తన, మాట తీరుతో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ సీరియల్ బ్యూటీ తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు టాప్ 4 కంటెస్టెంట్స్ తక్కువే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫినాలేకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో క్షణక్షణం ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..
ఈ సీజన్ టైటిల్ రేసులో తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూయేల్ మధ్య పోటా పోటీగా ఓటింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్ మధ్య తక్కువ ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నట్లు సమాచారం. అటు తనూజ, ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ తగ్గేదేలే అన్నట్లుగా ప్రమోట్ చేస్తూ తమ కంటెస్టెంట్లను గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. నిన్నటి వరకు తనూజ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండగా.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. అనుహ్యంగా ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఇద్దరూ టాప్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా లెక్కల ప్రకారం అటు తనూజ తోపాటు ఇమ్మూ, కళ్యాణ్ ఇద్దరికీ ఓటింగ్ పెరిగినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
ఇక నిన్నటి ఎపిసోడ్ తో ఓటింగ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ముందు నుంచి టైటిల్ రేసులో సై అంటున్న తనూజ, కళ్యాణ్ ఇద్దరికీ పోటీగా దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. బుధవారం ఎపిసోడ్ లో ఇమ్మూ జర్నీ వీడియో వేరేలెవల్. మొదటి నుంచి తన ఆట తీరు, కామెడీతో అలరించిన ఇమ్మూ.. ప్రతి చోట తన మాట, ఆటతో కట్టిపడేశాడు. దీంతో ఇప్పుడు ఇమ్మూ ఓటింగ్ మారిపోయినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు కాబోతున్నారనేది ఉత్కంఠగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..




