Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్… ఆ ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించిన సెంట్రల్ ఈసి

రాష్ట్ర ఎన్నికల అధికారులతో సెంట్రల్ EC టీమ్ ఎప్పటికప్పుడు వీడియో, టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పలు సూచనలు, ఆదేశాలతో పాటు ఎన్నికల నిర్వహణ పై అధికారులను హెచ్చరిస్తోంది. సోమవారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పై ECI కి వివరించారు సీఈఓ వికాస్ రాజ్. అదే విధంగా జిల్లాల వారీగా వివరాలు వెల్లడించారు DEO లు.ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా జరుగుతున్న పరిస్థితుల పై

Telangana: ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్... ఆ ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించిన సెంట్రల్ ఈసి
Ec
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 30, 2023 | 9:18 PM

హైదరాబాద్, అక్టోబర్30; ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచనలు చేసింది ECI. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టుదిట్టమైన భద్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించింది ECI. ఎలక్షన్ డ్యూటీలో నిర్లక్షం వహిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక తనిఖీల్లో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమిపిస్టున్న వేల EC స్పీడ్ పెంచింది. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సెంట్రల్ EC టీమ్ ఎప్పటికప్పుడు వీడియో, టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పలు సూచనలు, ఆదేశాలతో పాటు ఎన్నికల నిర్వహణ పై అధికారులను హెచ్చరిస్తోంది. సోమవారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పై ECI కి వివరించారు సీఈఓ వికాస్ రాజ్. అదే విధంగా జిల్లాల వారీగా వివరాలు వెల్లడించారు DEO లు.ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా జరుగుతున్న పరిస్థితుల పై కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్న కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫిర్యాదులపై ECI కి వివరించారు CEO వికాస్ రాజ్.

ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి దసరాకి రెండు రోజుల ముందు వరకు రోజూ వందల కోట్లు సీజ్ చేసిన అధికారులు… దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని EC కి ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆరా తీసింది. ఎన్నికలతో కానీ, రాజకీయాలతో కానీ సంబంధం లేని డబ్బు సీజ్ పై ECI పలు సూచనలు చేసింది. జిల్లా గ్రీవెన్సెస్ కమిటీల నుండి అనుమతి పొందిన తర్వాత సామాన్యుల డబ్బు ని వీలైనంత త్వరగా విడుదల చేయాలనీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.

ఇక సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగిసెలా సూచన చేసినట్టు సమాచారం. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం మొత్తం 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరపలని… ఇక మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరపాలని సూచన చేసింది eci.

ఇవి కూడా చదవండి

మరో రెండు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచనలు చేసింది ECI. ఇప్పటికే కేంద్ర బలగాలు రాష్ట్రంలో దిప్లీ చేసింది సెంట్రల్ ఈసీ, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలను రాష్ట్రానికి రప్పించనుంది కేంద్రం. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ప్రశాంతంగా జరిపెలా ECI ఆదేశాలు ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..