AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fight in Metro Train: వామ్మో.. అక్క ఆవేశం మామూలుగా లేదు.. మెట్రో రైల్లో రెచ్చిపోయింది.. అందరూ చూస్తుండగానే..

ఈ విభిన్న వీడియోలకు మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. అంతేకాకుండా, వేలాది మంది వినియోగదారులు ఈ క్లిప్‌లను ఇష్టపడ్డారు. వారి ఆలోచనలను కూడా కామెంట్‌ రూపంలో తెలియజేశారు. వీడియోలో అమ్మాయి చిరుతపులిలా కనిపిస్తుందని ఒకరు వ్యాఖ్యనించగా, ఆమె మెట్రోలో సన్ గ్లాసెస్ ధరించి లెజెండ్‌లా తిరుగుతుందని మరి కొందరు చెప్పారు. కాగా, తదుపరి స్టేషన్ పోలీస్ స్టేషన్ అని ఇంకొందరు సరదాగా రాశారు.

Fight in Metro Train: వామ్మో.. అక్క ఆవేశం మామూలుగా లేదు.. మెట్రో రైల్లో రెచ్చిపోయింది.. అందరూ చూస్తుండగానే..
Delhi Metro Fight Video
Jyothi Gadda
|

Updated on: Oct 30, 2023 | 6:41 PM

Share

ఢిల్లీ మెట్రోకు స్వాగతం..! తర్వాతి స్టేషన్ పోలీస్ స్టేషన్… ఢిల్లీ మెట్రో పరిస్థితి చూస్తుంటే DMRC నిజంగానే ఇలాంటి ‘స్టేషన్’ నిర్మించాలని అనిపిస్తోంది. తద్వారా మెట్రోలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా డ్రైవర్ ట్రైన్‌ను నేరుగా పోలీస్‌ స్టేషన్‌ ‘స్టేషన్’ వద్దకు మెట్రోను తీసుకెళ్లి ఆపేయొచ్చు. ప్రయాణికుల కారణంగా మరోసారి ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలిచింది మెట్రో. అవును, ఈ సారి మెట్రో ప్రయాణికులు ఏ అద్భుతం చేయలేదు.. కానీ పెద్ద పోరాటమే చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఒకరు.. ప్రయాణికుల మధ్య జరిగిన వార్‌ అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. వైరల్‌ వీడియోపై నెటిజన్లు తమ భావాలను వ్యక్తం చేశారు.

ఢిల్లీ మెట్రోలో ఓ అమ్మాయి ఎదురుగా సీటుపై కూర్చుని ఉన్న వ్యక్తికి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ మెట్రోలో తీవ్రంగా గొడవపడుతున్నారు. అమ్మాయి నిలుచుని ఉండగా ఎదురుగా సీటుపై అబ్బాయి కూర్చున్నాడు… ఇద్దరి మధ్య ఏదో గొడవ జరగడంతో ఆ అమ్మాయి ఆ కుర్రాడిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత వ్యవహారం సీరియస్‌గా మారింది. దాంతో చుట్టూ ఉన్న తోటి ప్రయాణికులు వారి మధ్యలో జోక్యం చేసుకున్నారు. అయినప్పటికీ వాళ్ల వార్‌ ముగియలేదు. ఆ అమ్మాయి మెట్రో కోచ్‌ నుంచి కిందకు దిగేంత వరకు వాగ్వాదం కొనసాగింది. ఇప్పుడు ఈ ఫైట్‌కి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి, వీటిని చూసి కొందరు యూజర్లు నవ్వు ఆపుకోలేక పోతున్నారు. మరి కొందరు మాత్రం ఇప్పుడు మెట్రోలో ఇదే దినచర్యగా మారిపోయిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఈ భీకర పోరాటానికి సంబంధించిన వీడియోను Instagram వినియోగదారు @its_faisal_no1 పోస్ట్ చేసారు. పైగా అతడు ఫన్నీగా ఇది ఏ మెట్రో లైన్ అని ప్రజలు అంచనా వేయాలని కూడా కోరారు. కాగా, ఈ విభిన్న వీడియోలకు మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. అంతేకాకుండా, వేలాది మంది వినియోగదారులు ఈ క్లిప్‌లను ఇష్టపడ్డారు. వారి ఆలోచనలను కూడా కామెంట్‌ రూపంలో తెలియజేశారు. వీడియోలో అమ్మాయి చిరుతపులిలా కనిపిస్తుందని ఒకరు వ్యాఖ్యనించగా, ఆమె మెట్రోలో సన్ గ్లాసెస్ ధరించి లెజెండ్‌లా తిరుగుతుందని మరి కొందరు చెప్పారు. కాగా, తదుపరి స్టేషన్ పోలీస్ స్టేషన్ అని ఇంకొందరు సరదాగా రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..