Viral Video: కొడుకు చదువు కోసం 30ఏళ్లు హౌస్‌ కీపింగ్‌ చేసిన మహిళ.. అందనంత ఎదిగిన అతన్ని చూసి.. పుత్రోత్సాహంతో..

కొడుకును బాగా చదివించి ప్రయోజకుడిగా తీర్చి దిద్దటం కోసం ఆమె గత 30 ఏళ్లుగా హౌస్ కీపింగ్ చేసింది. చివరకు అనుకున్నది సాధించిన కొడుకును చూసి ఆ తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుంది.. మాటల్లో వర్ణించలేని ఆ ఆనంద క్షణాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలాంటి భావోద్వేగ క్షణాలు నెటిజన్లను సైతం కదిలించాయి. ఇది మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేయబడింది..వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను మీరు చూడండి..

Viral Video: కొడుకు చదువు కోసం 30ఏళ్లు హౌస్‌ కీపింగ్‌ చేసిన మహిళ.. అందనంత ఎదిగిన అతన్ని చూసి.. పుత్రోత్సాహంతో..
Mother Son Viral Video F
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 30, 2023 | 6:00 PM

సోషల్ మీడియాలో ఓ అందమైన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ చాలా మంది హృదయాలను తాకింది. ఇందులో ఓ తల్లి తన కొడుకును పైలట్‌గా చూసినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే కొడుకు చదువు కోసం ఆ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతాకాదు.. కొడుకును బాగా చదివించి ప్రయోజకుడిగా తీర్చి దిద్దటం కోసం ఆమె గత 30 ఏళ్లుగా హౌస్ కీపింగ్ చేసింది. చివరకు అనుకున్నది సాధించిన కొడుకును చూసి ఆ తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుంది.. మాటల్లో వర్ణించలేని ఆ ఆనంద క్షణాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలాంటి భావోద్వేగ క్షణాలు నెటిజన్లను సైతం కదిలించాయి.

తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో తిప్పలు పడుతుంటారు. తమ సంతానాన్ని సరైన రీతిలో తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. తన బిడ్డ జీవితంలో మంచి స్థానం సాధించాలని కష్టపడి పనిచేస్తారు. అలాంటి ఓ తల్లి తన బిడ్డను పైలట్‌గా చేసేందుకు 30 ఏళ్ల పాటు హౌస్‌కీపింగ్‌గా పనిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో ప్రయాణించేందుకు వెళ్లిన ఆమె పైలట్ యూనిఫాంలో ఉన్న కొడుకును చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్షణాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మహిళ టికెట్‌ పట్టుకుని ఫ్లైట్‌లోకి వెళ్లడం వైరల్‌ వీడియోలో మనం చూడవచ్చు. గేటు వద్ద నిలబడి ఉన్న ఎయిర్ హోస్టెస్ వారి టిక్కెట్లను చెక్‌ చేస్తుంది. అప్పుడు ఆమె లోపలికి వెళ్ళమని ఆ మహిళ ప్రయాణికురాలికి పర్మిషన్‌ ఇస్తుంది. దానికి ముందు ఆమె అడ్దుగా ఉన్న కర్టెన్‌ తీస్తుంది..ఆ కర్టెన్ తొలగించిన వెంటనే ఆ మహిళా ప్రయాణికురాలు తన పైలట్ కొడుకు చేతిలో పుష్పగుచ్చంతో, యూనిఫాంలో తన ముందు నిలబడి ఉండటం కనిపించింది. దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే తన కొడుకు హత్తుకుని సంతోషపడిపోతుంది. ఆమె ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తల్లి ఏడుపు చూసిన తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది సైతం భావోద్వేగానికి గురయ్యారు.

ఈ భావోద్వేగ క్షణాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో @r/MadeMeSmile పోస్ట్ చేసారు. ఆమె క్యాప్షన్‌లో క్లెయిమ్ చేసింది – తన కొడుకును పైలట్‌గా తయారు చేయడానికి అతని చదువులకు అవసరమైన ఖర్చుల కోసం తాను గత 30 సంవత్సరాలు హౌస్‌కీపర్‌గా పనిచేసింది. ఆమె తన పైలట్ కుమారుడి విమానంలో ప్రయాణించినప్పుడు, ఆమె భావోద్వేగానికి గురై ఏడ్వడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది. ఇది మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేయబడింది..వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను మీరు కావాలంటే మరో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..