AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daily Curd Eating : వామ్మో.. ప్రతి రోజూ పెరుగు తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే..

విటమిన్ B12 నరాలు, మెదడు, రక్తానికి అవసరం. ఈ విటమిన్ చాలా తక్కువ ఆహారాలలో మాత్రమే లభిస్తుంది. పెరుగు తినడం వల్ల కొద్దిపాటి విటమిన్ బి12 లభిస్తుంది. మీరు అలసట, బలహీనతతో బాధపడుతుంటే, పెరుగు తినండి. దీన్ని తినడం వల్ల ఎనర్జీ, ఫ్రెష్ నెస్ రావడంతోపాటు అలసట అనిపించదు. ప్రతిరోజూ పరిమిత మోతాదులో పెరుగు తినడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందుతారు. అయితే పెరుగు ప్రతిరోజూ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.!

Daily Curd Eating : వామ్మో.. ప్రతి రోజూ పెరుగు తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే..
Jyothi Gadda
|

Updated on: Oct 30, 2023 | 3:15 PM

Share

పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి.. ముఖ్యంగా పెరుగు.. చాలా మందికి రోజూ భోజనంతో పాటు తప్పనిసరిగా పెరుగు కూడా తినే అలవాటు ఉంటుంది. ఎన్ని రకాల వంటకాలు తిన్నా సరే..వారికి పెరుగు తిన్న తర్వాతే భోజనం పూర్తైందనే భావన కలుగుతుంది. అలాంటి పెరుగులో రకరకాల పోషకాలు ఉంటాయి. పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. పెరుగులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. అయితే పెరుగు ప్రతిరోజూ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సందర్భాల్లో పెరుగు హానికరం అని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే, మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీరు పెరుగు తినాలా వద్దా అనేది నిపుణులను అడిగి తెలుసుకోవాలి. రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రొటీన్..

ప్రతి కణం పెరగడానికి అమైనో ఆమ్లాలు అవసరం, అవి ప్రోటీన్లను సరఫరా చేస్తాయి. మన శరీరంలోని చాలా అవయవాల్లో ప్రొటీన్‌ తయారవుతుంది. అలాగే పెరుగు తినడం వల్ల కూడా మీకు కావలసిన ప్రొటీన్లు అందుతాయి. ఇది కండరాలు, చర్మం, జుట్టు, గోళ్లకు మేలు చేస్తుంది. కాబట్టి మీరు రోజూ పెరుగు తింటే, మీ శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ..

ప్రోబయోటిక్స్ అనేది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడేందుకు ప్రేగులలో కనిపించే మంచి బ్యాక్టీరియా. కడుపులో ఈ బ్యాక్టీరియాను నిర్వహించడానికి పెరుగు అవసరం. పెరుగు శరీరంలో మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది.. పెరుగును రోజూ తీసుకుంటే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది.

కాల్షియం..

పాలు, అన్ని రకాల పాల ఉత్పత్తులు శరీరానికి కాల్షియంను అందిస్తాయి. కాల్షియం శరీరంలోని ఎముకలను బలపరుస్తుంది. కావున పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం తొలగిపోయి ఎముకలు బలహీనపడకుండా ఉంటాయి.

విటమిన్ B12..

విటమిన్ B12 నరాలు, మెదడు, రక్తానికి అవసరం. ఈ విటమిన్ చాలా తక్కువ ఆహారాలలో మాత్రమే లభిస్తుంది. పెరుగు తినడం వల్ల కొద్దిపాటి విటమిన్ బి12 లభిస్తుంది. మీరు అలసట, బలహీనతతో బాధపడుతుంటే, పెరుగు తినండి. దీన్ని తినడం వల్ల ఎనర్జీ, ఫ్రెష్ నెస్ రావడంతోపాటు అలసట అనిపించదు. ప్రతిరోజూ పరిమిత మోతాదులో పెరుగు తినడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..