Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అట్టహాసంగా గోమాతకు స్వయంవరం.. నందీశ్వరులకు ఆహ్వానం.. మేళ తాళాలు, విందు భోజనాల ఏర్పాట్లు..

Kakinada: స్వయం వరానికి దండకారణ్య ప్రాంతం నుండి 12నందీశ్వర్లు హాజరయ్యారు. నందీశ్వర్లు కళ్యాణ మంటపంలో వరుసగా నిలబడగా ఏలేశ్వరానికి చెందిన పాకలపాటి నారాయణ రాజు సీతాదేవి దంపతులకు చెందిన షణ్ముఖ కన్నయ్య అనే నందీశ్వరుడిని గోమాత సారణ స్వయం వరంలో వరించింది. అనంతరం షణ్ముఖ,సారణలకు మేళతాళాలతో వైభవంగా వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు.

Andhra Pradesh: అట్టహాసంగా గోమాతకు స్వయంవరం.. నందీశ్వరులకు ఆహ్వానం.. మేళ తాళాలు, విందు భోజనాల ఏర్పాట్లు..
Swayamwaram
Follow us
Pvv Satyanarayana

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 29, 2023 | 9:04 PM

పురాణాల్లో సీతాదేవి స్వయంవరం గురించి విన్నాం.. ఈ కలియుగంలో ఒక ఆవుకి స్వయంవరం చేయడం విశేషంగా ఆకట్టుకుంటుంది. కాకినాడకు చెందిన డాక్టర్ గౌరీశేఖర్ పెంపుడు ఆవు సారణ కు అదే స్థాయిలో స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున కళ్యాణ మండపంలో స్వయంవరం వేడుకలు నిర్వహించారు. .ఈ స్వయం వరానికి వివిధ జాతులకు చెందిన 12 నందీశ్వరులతో హాజరయ్యారు రైతులు. సాధారణంగా రైతులు పల్లెల్లో గోమాత వృషభ కళ్యాణాలు జరిపించడం మనం చూస్తుంటాం. కానీ కాకినాడలో గౌరీ శేఖర్ రమాదేవి దంపతులు గోమాతకు స్వయం వరం నిర్వహించి గోమాత వృషభ కళ్యాణం మేళతాళాల తో వైభవంగా జరిపించడం అందరినీ ఆకట్టుకుంది. తిరుపతి, కంచి తిరువణ్ణామలై నుండి వచ్చిన వేద పండితులు శాస్త్రోక్తంగా మేళతాళాలతో వైభవంగా గోమాత సారణ, వృషభ కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురానికి చెందిన ప్రముఖ విశ్వ విద్య, ఆధ్యాత్మిక వేత్త ఉమర్ అలీషా, APSP అసిస్టెంట్ కమేండెంట్ వీరభద్రయ్య హాజరయ్యారు. ప్రజలు, కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో గోమాత కళ్యాణాన్ని వీక్షించారు.

కాకినాడ కు చెందిన డాక్టర్ గౌరీ శేఖర్ కు గోవుల మీద ఉన్న మక్కువతో పుంగనూరు జాతికి చెందిన గోవును కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఈ గోవుకు బారసాల వేడుకలు నిర్వహించి సారణ గా నామకరణం చేశారు. ఇప్పుడు కళ్యాణం జరిపించాలని నిర్ణయించి వివిధ ప్రాంతాలకు చెందిన నందీశ్వర్లు(వృషభాలకు) ఆహ్వాన పత్రికలు పంపించారు. స్వయం వరానికి దండకారణ్య ప్రాంతం నుండి 12నందీశ్వర్లు హాజరయ్యారు. నందీశ్వర్లు కళ్యాణ మంటపంలో వరుసగా నిలబడగా ఏలేశ్వరానికి చెందిన పాకలపాటి నారాయణ రాజు సీతాదేవి దంపతులకు చెందిన షణ్ముఖ కన్నయ్య అనే నందీశ్వరుడిని గోమాత సారణ స్వయం వరంలో వరించింది. అనంతరం షణ్ముఖ,సారణలకు మేళతాళాలతో వైభవంగా వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు.

గోమాత సారణ మాఇంటికి వచ్చినప్పటినుండి మాకు అన్నీ శుభాలే జరుగుతున్నాయని మా అమ్మాయిలిద్దరూ డాక్టర్లు గా విదేశాలలో స్ధరపడ్డారు. వారికి వివాహాలు కూడా జరిగాయి. అందుకే సారణను మూడవ కూతురు గా భావించి కన్న కూతురులా పెంచి రెండు సంవత్సరాల క్రితం బారసాల వేడుకలు నిర్వహించి సారణ గా నామకరణం చేసి ఇప్పుడు స్వయం వరం నిర్వహించి కళ్యాణం జరిపించామని డాక్టర్ గౌరీ శేఖర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..