తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు, పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం రాత్రి 7.05 గంటలలకు తలుపులు మూసిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయం దాదాపు 8 గంటల పాటూ మూతపడింది. అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి.. ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమతి ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తయ్యింది.

తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 29, 2023 | 7:38 PM

తిరుమల, 2023 అక్టోబ‌రు 29:  పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం రాత్రి 7.05 గంటలలకు తలుపులు మూసిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయం దాదాపు 8 గంటల పాటూ మూతపడింది. అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి.. ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమతి ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తయ్యింది. మరోవైపు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని శ‌నివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశారు.. ఆదివారం ఉదయం 9 గంటలకు తెరిచారు.

ఇదిలా ఉంటే.. తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు వెల్లడించింది టిటిడి.

నవంబరులో తిరుమలలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి…

ఇవి కూడా చదవండి

– నవంబరు 9న మతత్రయ ఏకాదశి

– నవంబరు 11న మాస శివరాత్రి

నవంబరు 12న దీపావళి ఆస్థానం

– నవంబరు 13న కేదారగౌరీ వ్రతం

– నవంబరు 14న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర

– నవంబరు 15న భగనీహస్త భోజనం

– నవంబరు 16న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర

– నవంబరు 17న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.

– నవంబరు 18న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణం

– నవంబరు 19న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, స్కంద షష్టి.

– నవంబరు 22న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి

– నవంబరు 23న ప్రబోధన ఏకాదశి

– నవంబరు 24న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.

– నవంబరు 26న కార్తీక పౌర్ణమి

– నవంబరు 27న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర

– నవంబరు 28న శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

ఇదిలా ఉంటే, వచ్చే సంవత్సరం 2024 సంవత్సరానికి గానూ టిటిడి కొత్త డైరీలు, క్యాలెండర్లను విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్త‌క విక్ర‌య‌శాల‌ల్లో 2024 క్యాలెండర్లు, డైరీలు భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, టీటీడీ వెబ్‌సైట్ www.ttdevasthanams.ap.gov.in ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భ‌క్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పించింది టిటిడి.

ఈ మేరకు టీటీడీ ధ‌ర‌ల వివ‌రాలు ప్రకటించింది..

12 పేజీల క్యాలెండర్ ధర రూ.130, డీలక్స్ డైరీ ధర రూ.150, చిన్న డైరీ ధర రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ ధర రూ.75, 6 పేజీల క్యాలెండర్ రూ.450 లు గా టీటీడీ నిర్ధారించింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి పెద్ద క్యాలెండర్ రూ.20లకు, శ్రీ‌వారు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క్యాలెండర్ రూ.15లకు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి పెద్ద క్యాలెండర్ రూ.20లకు, తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర రూ.30 గా నిర్ణయించి అమ్మకాలను ప్రారంభించింది.

చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..