Ladies Finger: బెండకాయలు నానబెట్టిన నీళ్లను తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?

బెండకాయలో కేలరీలు చాలా తక్కువ. నీటిలో కరిగే, నీటిలో కరగని ఫైబర్ రెండింటికి మంచి మూలం. దీంతో శరీరంలోని పీచు మెల్లగా విచ్ఛిన్నమవుతుంది. దీని కారణంగా, రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది. అంతేకాదు.. ఇలా బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవటం వల్ల దగ్గు, గొంతు నొప్పులను దూరం చేస్తుంది. గొంతు వాపు, దగ్గు, గొంతులో దురద వంటి సమస్యలుంటే.. బెండకాయ నీరు అద్భుతంగా పనిచేస్తుంది.

Ladies Finger: బెండకాయలు నానబెట్టిన నీళ్లను తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?
Ladies Finger
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2023 | 6:27 PM

ప్రతి ఒక్కరూ పోషక విలువలు, నీటి కంటెంట్ ఉన్న ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. బెండకాయలో రకరకాల పోషక విలువలు ఉన్నాయి. బెండకాయలు నానబెట్టిన నీరు రక్తంలో చక్కెరను కంట్రోల్‌ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. బెండకాయలో శరీరానికి పోషణను అందించే అనేక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో ఫైబర్, విటమిన్-బి6, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-బి శరీరంలో డయాబెటిక్ న్యూరోపతి అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఇది శరీరంలో హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది మధుమేహానికి ప్రధాన కారణం. బెండకాయ నీటిలో కరిగే ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.

బెండకాయలో కేలరీలు చాలా తక్కువ. నీటిలో కరిగే, నీటిలో కరగని ఫైబర్ రెండింటికి మంచి మూలం. దీంతో శరీరంలోని పీచు మెల్లగా విచ్ఛిన్నమవుతుంది. దీని కారణంగా, రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. బెండకాయ నీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ‘అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్’ ప్రకారం, డయాబెటిక్ రోగులకు బెండకాయ నీరు చాలా మంచిది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బెండకాయ వాటర్ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బెండకాయ నీటిని తయారు చేయడానికి, 5-6 బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి. ముక్కలుగా కట్‌ చేసుకుని నీటిలో వేసి మూతపెట్టండి.. ఆ మరుసటి రోజు ఉదయం పరగడుపునే బెండకాయ నీటిని వడకట్టుకోవాలి. అనంతరం ఆ నీటిని తాగేయండి. క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఈ నీటిని తాగడం వల్ల మీ ఒంట్లోని షుగర్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. బెండకాయలో ఇన్సులిన్ ప్రాపర్టీలు అధికంగా ఉంటాయి. ఇవి చక్కర వ్యాధిని నియంత్రించడానికి తొడ్పడతాయి. నానబెట్టిన బెండకాయను తీసుకోవడం వల్ల..రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. ఇలా బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవటం వల్ల దగ్గు, గొంతు నొప్పులను దూరం చేస్తుంది. గొంతు వాపు, దగ్గు, గొంతులో దురద వంటి సమస్యలుంటే.. బెండకాయ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. బెండకాయలో ఉండే యాంటీ సెఫ్టిక్ లక్షణాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అతిసారాన్ని నియంత్రించడంలో కూడా బెండకాయ నానబెట్టిన నీరు ఎంతగానో సహాయపడుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!