Health Tips : బ‌రువు త‌గ్గించ‌డంలో త‌మ‌ల‌పాకు భేష్.. ఇలా చేస్తే వారం రోజుల్లోనే కొవ్వు కరిగి నాజుకు నడుము మీ సొంతం..!!

మిరియాలతో తమలపాకులను తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు గమనిస్తారు.. ఆయుర్వేదంలో ఈ పద్ధతి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులోని విషాన్ని తొలగిస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించి కేవలం పచ్చి తమలపాకులను మాత్రమే తినండి.. ఎందుకంటే వాటిలో ఈ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పండిన లేదంటే ఎండిపోయిన తమలపాకులను ఈ పద్ధతిలో తీసుకుంటే, మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, మీరు ప్రతిరోజూ మిరియాలతో పాటు తమలపాకులను తింటే, ఎనిమిది వారాల తర్వాత మీ బరువులో మార్పు కనిపిస్తుంది.

Health Tips : బ‌రువు త‌గ్గించ‌డంలో త‌మ‌ల‌పాకు భేష్.. ఇలా చేస్తే వారం రోజుల్లోనే కొవ్వు కరిగి నాజుకు నడుము మీ సొంతం..!!
Betel Leaf And Pepper
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2023 | 4:01 PM

Health Tips : అధిక బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు.. అనేక శారీరక రోగాలకు దారి తీస్తుంది.. అందుకే అధిక బరువు తగ్గించుకోవటం, పొట్ట, నడుం చుట్టూ కొవ్వును కరిగించుకోవటానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమంది వ్యాయామాలు, జిమ్‌లకు వెళ్లే సమయం కూడా ఉండదు. అందుకని వారు.. బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.. ఆహారం తక్కువగా తీసుకుంటే.. బరువు కంట్రోల్‌ ఉంటుందని భావిస్తారు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు కరిగి నాజుకైన నడుమును సొంతం చేసుకుంటారు.. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి తమలపాకులను ప్రయోజనకరంగా భావిస్తారు. అంతే కాదు ఎనిమిది వారాల్లోనే ప్రభావం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకులోని పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సరైన జీవక్రియను నిర్వహిస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తమలపాకులను తీసుకోవడం వల్ల చాలా వరకు కొవ్వులు కరిగి బరువు తగ్గడం సులభం అవుతుంది.

అలాగే ఆయుర్వేదంలో, తమలపాకులను శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయకరంగా భావిస్తారు. అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ వల్ల వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. అయితే ఇవే కాకుండా అధిక వ‌రువును త‌గ్గించ‌డానికి దివ్య ఔష‌దంలా ప‌నిచేస్తోంది.త‌మ‌ల‌పాకులు క‌డుపు ఉబ్బ‌రం ల‌క్ష‌ణాలు, జీర్ణ‌క్రియ చికిత్స‌లో స‌హాయ‌ప‌డ‌తాయి. ఎలాంటి క‌స‌ర‌త్తులు చేయ‌కుండా కొవ్వుని త‌గ్గించ‌వ‌చ్చు.

ఇవి కూడా చదవండి

పచ్చి తమలపాకు తీసుకుని అందులో ఐదు మిరియాలు వేసి పాన్‌ కట్టుకోండి. అలా తయారు చేసిన పాన్‌ ఎక్కువ సేపు నోటిలో పెట్టుకోండి..మీరు సాధారణ పాన్ తింటున్నట్టుగానే..అలా నోటిలో ఏర్పడిన లాలాజలం కడుపులోకి వెళ్లనివ్వండి. ఎనిమిది వారాల పాటు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపున ఇలా మిరియాలతో తమలపాకులను తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు గమనిస్తారు.. ఆయుర్వేదంలో ఈ పద్ధతి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులోని విషాన్ని తొలగిస్తుంది.

ఈ పద్ధతిని ఉపయోగించి కేవలం పచ్చి తమలపాకులను మాత్రమే తినండి.. ఎందుకంటే వాటిలో ఈ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పండిన లేదంటే ఎండిపోయిన తమలపాకులను ఈ పద్ధతిలో తీసుకుంటే, మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, మీరు ప్రతిరోజూ మిరియాలతో పాటు తమలపాకులను తింటే, ఎనిమిది వారాల తర్వాత మీ బరువులో మార్పు కనిపిస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..