ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే…మీ రోజువారి ఆహారంలో ఇలాంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి..
శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండటం మంచిది. వీలైనంత వరకు బయట తినే బదులు ఇంట్లోనే పౌష్టికాహారం వండుకోవడం మంచిది. లేకుంటే మనం రోజూ తినే ఆహార పదార్థాల్లోని పోషకాల వైవిధ్యాన్ని, మోతాదును కనీసం అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. ఏది ఏమైనా, మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే కొన్ని ఆహారాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం... వీటిని దృష్టిలో ఉంచుకుని మీ డైట్ ప్లాన్ మార్చుకోవడం మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఆరోగ్యకరమైన జీవనానికి పునాది ఆరోగ్యకరమైన ఆహారం.. మనం తినే ఆహారం మనపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే అన్ని పోషకాలు లభించే విధంగా సమతుల్య ఆహారం తీసుకోవటం ముఖ్యం. కానీ, నేటి ఆధునిక యుగంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడిపోయారు. దీంతో చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం, ఉబకాయం, అధిక బీపీ వంటి సమ్యలతో సతమతమవుతున్నారు. అందుకే వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. బయట లభించే ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్ వంటి ఆహారం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందకపోగా, అనారోగ్యం పాలవుతున్నారు. శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండటం మంచిది. వీలైనంత వరకు బయట తినే బదులు ఇంట్లోనే పౌష్టికాహారం వండుకోవడం మంచిది. లేకుంటే మనం రోజూ తినే ఆహార పదార్థాల్లోని పోషకాల వైవిధ్యాన్ని, మోతాదును కనీసం అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. ఏది ఏమైనా, మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే కొన్ని ఆహారాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం… వీటిని దృష్టిలో ఉంచుకుని మీ డైట్ ప్లాన్ మార్చుకోవడం మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
ప్రతిరోజూ శాకాహారం ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. రకరకాల కూరగాయలు తినండి. మీరు తీసుకునే ఆహారం బహుళ-రంగులు కలిగి ఉండేలా చూసుకోండి..ఎందుకంటే..ప్రతి రంగులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. తక్కువ పిండి పదార్ధాలు ఉన్న కూరగాయలు మంచివి.
కొవ్వు శరీరానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. కానీ ఆరోగ్యకరమైన కొవ్వులు మంచివి. ఉదాహరణకు గింజలు, డ్రై ఫ్రూట్స్, ఆలివ్ నూనె, అవకాడో, చేపలు వంటివి తీసుకోవటం మంచిది. ప్రతిరోజూ మీ డైట్‌లో ఇలాంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న ఆహారాన్ని చేర్చడానికి ప్రయత్నించండి. అదనంగా పచ్చి కొబ్బరి నూనె, ఆర్గానిక్ వర్జిన్ కొబ్బరి నూనె కూడా మంచివి.
మాంసం తినడం కూడా మంచిది. ఇది ప్రధానంగా జంతు ప్రోటీన్‌ను అందించడానికి సహాయపడుతుంది. కానీ, అతిగా తీసుకోవటం అనర్థం.. ఎల్లప్పుడూ మీరు తీసుకునే మాంసం పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాంసాహారం తినేటప్పుడు అతిగా తినకుండా జాగ్రత్త వహించండి. మీరు శాఖాహారులైతే బదులుగా మీరు సప్లిమెంట్లు లేదా వేగన్ ప్రోటీన్‌లను ఉపయోగించవచ్చు.
ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన చేపలు కూడా చాలా ఆరోగ్యాన్ని అందజేస్తాయి.. ఇందులో చిన్న చేపలు ఎక్కువగా ఉంటాయి. చేపలు తినేవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ..సాల్మన్ చేప తీసుకోవడం ఉత్తమం. మొత్తానికి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే శరీరానికి మేలుచేసే పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రోటీన్లను కాస్త తక్కువగా ఆహారంలో తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..