AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Tips: వృద్ధాప్య ఛాయలను తరిమికొట్టండి.. ఈ అలవాట్లతో నిత్య యవ్వనం గ్యారంటీ..

వృద్ధాప్య ఛాయలను అధిగమించి సహజమైన రీతిలో నిత్య యవ్వనంగా కనిపించేందుకు మీరు ప్రతిరోజూ కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవాలని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎప్పటికీ యవ్వనంగా ఉండటానికి లేదా వంద సంవత్సరాలు జీవించడానికి చక్కని మార్గాలు ఏమిటో తెలుసుకుందాం?

Anti Aging Tips: వృద్ధాప్య ఛాయలను తరిమికొట్టండి.. ఈ అలవాట్లతో నిత్య యవ్వనం గ్యారంటీ..
Anti Aging Tips
Janardhan Veluru
|

Updated on: Oct 29, 2023 | 5:41 PM

Share

Anti Aging Tips in Telugu: ఎప్పటికీ యవ్వనంగా ఉండడానికి ఎలాంటి సీక్రెట్ ఫార్ములా లేదు కానీ.. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు దీనికి దోహదపడుతాయి. ఈ అలవాట్లను నిత్యం పాటిస్తే, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వృద్ధాప్య ఛాయలను నివారించవచ్చు లేదా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించవచ్చు. వృద్ధాప్య ఛాయలను అధిగమించి సహజమైన రీతిలో నిత్య యవ్వనంగా కనిపించేందుకు మీరు ప్రతిరోజూ కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవాలని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎప్పటికీ యవ్వనంగా ఉండటానికి లేదా వంద సంవత్సరాలు జీవించడానికి చక్కని మార్గాలు ఏమిటో తెలుసుకుందాం?

  1. మీ డైట్‌లో మార్పులు చేసుకోండి: మీరు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం లేదా చక్కెర అధికంగా ఉన్నవి తింటుంటే.. మీలో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది. అందుకే వెంటనే వీటికి గుడ్ బై చెప్పండి.  పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు దీర్ఘకాలంలో మెదడు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతాయి. అలాగే తాజా కూరగాయలు, పండ్లు వృద్ధాప్య పురోగతిని నెమ్మదిస్తాయి. వీటిని ఎక్కువగా మీ డైట్‌లో చేర్చుకోవాలి.
  2. వ్యాయామం: వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి వ్యాయామం. ఏజింగ్ సెల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయన కథనం మేరకు.. జీవితాంతం వ్యాయామం చేసే వ్యక్తుల్లో మెరుగైన శరీర అభివృద్ధి, తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు, సరైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు.
  3. విటమిన్ డీ: మీరు సూర్యరశ్మి నుండి పొందే విటమిన్ డి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ డి అధిక స్థాయిలో ఉన్న వారికి వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. మెరిసే చర్మ సౌందర్యం వారి సొంతం అవుతుంది.
  4. సన్‌స్క్రీన్ లోషన్స్ వాడండి: ఎండ తీవ్రత క్యాన్సర్‌కు కారణం అవడంతో పాటు మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) ప్రకారం, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి మీరు ఇంటిని విడిచిపెట్టే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్లు అప్లై చేయాలి.
  5. పుష్కలంగా నీరు త్రాగండి: వృద్ధాప్యాన్ని తగ్గించే ప్రధాన మార్గాలలో పుష్కలంగా నీరు త్రాగటం చాలా ముఖ్యం. నీరు మూత్రవిసర్జన, చెమట మరియు ప్రేగు కదలికల ద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీ శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచుతుంది. అలాగే కీళ్లకు ద్రవపదార్థం చేరేలా చేస్తుంది.
  6. ధూమపానం మానుకోండి: ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం కావడంతో పాటు.. వారి వయస్సును వేగంగా పెంచుతుంది. పొగాకు మీ చర్మపు బయోఫిజికల్ పరిమితులను ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనం తేలింది. చర్మం ప్రకాశాన్ని కోల్పోవడం తదితర సమస్యలకు ఇది కారణమవుతుంది. అందుకే వృద్ధాప్య ఛాయలు దరిచేరనియ్యకూడదంటే ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
  7. ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి: దంత పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. ఇది మీ దంతాలు మెరుగ్గా కనిపించడమే కాకుండా, గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వంటి వయస్సు సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. మీ గట్‌లో మంచి బాక్టీరియా మొత్తాన్ని పెంచడం వల్ల డిమెన్షియా వంటి వయస్సు-సంబంధిత వ్యాధుల నుండి రక్షించవచ్చు.
  8. కంటి నిండా నిద్ర: ఇవి కాకుండా, ఒత్తిడిని నివారించడం ద్వారా మంచి నిద్రను పొందండి. సరైన నిద్ర కూడా  వృద్ధాప్య ఛాయలు దూరంగా ఉంచుతుంది.