TTD: శ్రీవారి భ‌క్తుల‌కు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.

TTD: శ్రీవారి భ‌క్తుల‌కు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.

Anil kumar poka

|

Updated on: Oct 29, 2023 | 9:36 PM

టీటీడీ ముద్రించిన 2024వ సంవ‌త్స‌రం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్త‌క విక్ర‌య‌శాల‌ల్లో భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ధ‌ర‌ల వివ‌రాలు ప్రకటించింది.

టీటీడీ ముద్రించిన 2024వ సంవ‌త్స‌రం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్త‌క విక్ర‌య‌శాల‌ల్లో భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ధ‌ర‌ల వివ‌రాలు ప్రకటించింది. 12 పేజీల క్యాలెండర్ ధర రూ.130, టేబుల్ టాప్ క్యాలెండర్ ధర రూ.75, 6 పేజీల క్యాలెండర్ రూ. 450 లు గా నిర్ధారించింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి పెద్ద క్యాలెండర్ రూ.20లకు, తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర 30 రూపాయలు గా నిర్ణయించి అమ్మకాలను ప్రారంభించింది. తిరుపతి, తిరుమల లోనే కాకుండా బ‌య‌టి ప్రాంతాల్లో అమ్మకాలు చేపడుతోంది. చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..