AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election 2023: రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన..

ఇక, దేశంలో నవంబర్‌ నెలలో ఐదు ఛత్తీస్‌గఢ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్​, మిజోరం, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నవంబర్​ 7 నుంచి నవంబర్​ 30 మధ్యలో పోలింగ్​ జరుగుతుంది. మిజోరంలో నవంబర్​ 7న ఒక దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న కౌంటింగ్​ ప్రక్రియ ఉంటుంది. మధ్యప్రదేశ్​లో నవంబర్​ 17న ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న ఫలితాలను ప్రకటిస్తుంది ఈసీ. రాజస్థాన్​లో నవంబర్​ 23న పోలింగ్​ ఉంటుంది. ఫలితాలు డిసెంబర్​ 3న బయటకు వస్తాయి. తెలంగాణలో నవంబర్​ 30న ఒక దశలో పోలింగ్​ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలతో కలిపి.. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడతాయి.

Assembly Election 2023: రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం...  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన..
Rahul Gandhi
Jyothi Gadda
|

Updated on: Oct 29, 2023 | 8:06 PM

Share

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పలు హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తామని ప్రకటించిన రాహుల్‌.. ఇప్పుడు ప్రజలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి లేని గ్రామీణ కార్మికులకు సంవత్సరానికి 10 వేల రూపాయలు. సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మన దేశంలో 2 రకాల ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు రాహుల్‌ గాంధీ… ఒకటి దేశంలోని ధనవంతుల కోసం మాత్రమే పని చేసే బీజేపీ, మరోకటి దేశంలోని రైతులు, కార్మికులు, యువత కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ అని చెప్పారు. తమకు ఏ ప్రభుత్వం కావాలో ఓటర్లు నిర్ణయించుకోవాలన్నారు రాహుల్‌ గాంధీ.

ఇవి కూడా చదవండి

90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభకు నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో 20 నియోజకవర్గాలకు, రెండో దశలో 70 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెలువడనున్నాయి..

ఇక, దేశంలో నవంబర్‌ నెలలో ఐదు ఛత్తీస్‌గఢ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్​, మిజోరం, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నవంబర్​ 7 నుంచి నవంబర్​ 30 మధ్యలో పోలింగ్​ జరుగుతుంది.

మిజోరంలో నవంబర్​ 7న ఒక దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న కౌంటింగ్​ ప్రక్రియ ఉంటుంది.

మధ్యప్రదేశ్​లో నవంబర్​ 17న ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న ఫలితాలను ప్రకటిస్తుంది ఈసీ.

రాజస్థాన్​లో నవంబర్​ 23న పోలింగ్​ ఉంటుంది. ఫలితాలు డిసెంబర్​ 3న బయటకు వస్తాయి.

తెలంగాణలో నవంబర్​ 30న ఒక దశలో పోలింగ్​ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలతో కలిపి.. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడతాయి.

5 రాష్ట్రాల్లో 1.77లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ 1.77లక్షల పోలింగ్​ కేంద్రాల్లో 17,734 మోడల్​ పోలింగ్​ స్టేషన్స్​ ఉంటాయని, 621 పోలింగ్​ కేంద్రాలను పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహిస్తారని స్పష్టం చేసింది. ఈసారి.. 5 రాష్ట్రాల్లో దాదాపు 60లక్షల మంది తొలిసారి ఓటు హక్కు సాధించారని తెలిపింది. మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 16కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..