AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

విశాఖ సమీపంలో కొత్త వలస దగ్గర ఆగి ఉన్న పలాస ప్యాసింజర్‌ను విశాఖపట్నం నుంచి వస్తున్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద ప్రాంతం నుంచి వచ్చిన వీడియోలను పరిశీలించినప్పుడు పలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. . వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradesh Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ
Andhra Train Accident
Ram Naramaneni
| Edited By: Subhash Goud|

Updated on: Oct 30, 2023 | 12:10 AM

Share

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది.  ఆదివారం రాత్రి  రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్.. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో చిమ్మచీకట్లు ఉండటం.. సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.  రైల్వే అధికారుల, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న స్పెషల్ ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం ట్రాక్ ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ ట్రైన్‌ను.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది.  రైలు ప్రమాద దుర్ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Oct 2023 12:09 AM (IST)

    ఘటన స్థలంలో 15 అంబులెన్స్‌లు

    ఏపీ రైలు ప్రమాదంలో 15 అంబులెన్స్‌లు ఉన్నాయి. క్షతగాత్రులను వెంటవెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నాయి. మెరుగైన చికిత్స అందించడంలో భాగంగా మరిన్ని అంబులెన్స్‌లను రప్పిస్తున్నారు.

  • 30 Oct 2023 12:07 AM (IST)

    లోకో పైలట్‌ మృతి

    రైలు ప్రమాద ఘటనలో ఒక రైలు లోకో పైలట్‌, గార్డ్‌ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • 29 Oct 2023 10:42 PM (IST)

    విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    డిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదాన్ని మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును పలాస ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది.   ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మృతులు కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

  • 29 Oct 2023 09:34 PM (IST)

    ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి

    రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది.

  • 29 Oct 2023 09:19 PM (IST)

    రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు 

    • కంటకాపల్లి జంక్షన్ వద్ద రైలు ప్రమాదం
    • ప్రమాదంలో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
    • మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్
    • క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆసుపత్రులకు తరలింపు
  • 29 Oct 2023 09:14 PM (IST)

    విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం

    విజయనగరం : చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి

    ➡️ బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో ఫోన్ నంబర్ ఏర్పాటు

    ➡️ బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే ఫోన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు : జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి

  • 29 Oct 2023 09:12 PM (IST)

    హెల్ప్‌ లైన్‌ నంబర్లు

    విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం..  0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Published On - Oct 29,2023 9:12 PM