భోజనం చేయటానికి ముందు, చేసిన తరువాత ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..
సాధారణంగా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం కారణంగా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీని కారణంగా రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు ప్రభావితమవుతాయి. కడుపు సమస్యలను నివారించడానికి మీరు ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా విస్మరించకూడదు.
ప్రస్తుత కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు పూర్తిగా క్షీణించాయి. ప్రజలు ఏ ఆహారం తమకు ఆరోగ్యకరమైనది. ఏది అనారోగ్యకరమైనది అని పట్టించుకోవటం లేదు. మీరు మీ రోజువారీ జీవితంలో ప్రతి రోజూ ఇంట్లో, పార్టీల పేరుతో పీకల దాకా ఆయిల్ ఫుడ్స్ తింటూ కడుపు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలతో అవస్థలు పడుతుంటారు. సాధారణంగా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం కారణంగా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీని కారణంగా రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు ప్రభావితమవుతాయి. కడుపు సమస్యలను నివారించడానికి మీరు ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా విస్మరించకూడదు.
నీళ్లు తాగడం:
మీరు భోజనానికి కొంత సమయం ముందే నీళ్లు తాగటం మంచింది. అయితే, మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటం మంచిది. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియతో సహా అన్ని శరీర విధులు సరిగ్గా పనిచేస్తాయి. మీరు రోజంతా కనీసం 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. లేదంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తింటే కూడా ప్రయోజనం ఉంటుంది.
అల్లం తింటే కూడా మంచిది:
మీరు రోజువారీ ఆహారంలో పరిమిత పరిమాణంలో అల్లం తీసుకుంటే మంచిది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అప్పుడప్పుడు మీ ఆహారంతో పాటు అల్లం వినియోగం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. శరీరంలోని వ్యాధులు కూడా నయమవుతాయి. మీరు పచ్చి అల్లం కూడా నమిలి తింటే మంచిది. లేదంటే అల్లం టీ, అల్లం నీరు., అల్లంతో తయారు చేసిన స్వీట్ కూడా తినొచ్చు.
పెరుగు తినండి:
మనం తప్పనిసరిగా పెరుగు తినాలి. ఇది ప్రోబయోటిక్ ఆహారం. దీనిలో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని స్వభావం చల్లగా ఉంటుంది.. కాబట్టి, ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
సరైన వాకింగ్:
చాలా మందికి ఆహారం తిన్న వెంటనే మంచం మీద పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా అస్సలు చేయకండి. తిన్న తర్వాత తప్పనిసరిగా 10 నుండి 15 నిమిషాలు నడవండి. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం లేదా గ్యాస్ వంటి సమస్యలు రావు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..