- Telugu News Photo Gallery Curry Leaves Benefits: Eat curry leaves On An Empty Stomach For Weight Loss, Hair Growth, Better Digestion
Curry Leaves Benefits: జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగాలంటే.. రోజూ పరగడుపున ఈ ఆకులు 5-6 తింటే సరి..
కరివేపాకు చెట్టు ప్రతి ఇంటి పెరట్లో ఉంటుంది. దాదాపు అన్ని వంటకాల్లో కరివేపాకు వేస్తుంటారు. కూరగాయలు, పప్పు, అన్నం, కూరగాయలు ఇలా అన్నీ రకాల వంటకాలకు కరివేపాకు ప్రత్యేక రుచిని తీసుకువస్తుంది. కరివేపాకు ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. అవేంటో తెలుసుకుందాం.. కరివేపాకులో కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి అనేక పోషకాలు అధికంగా..
Updated on: Oct 30, 2023 | 4:03 PM

కరివేపాకు చెట్టు ప్రతి ఇంటి పెరట్లో ఉంటుంది. దాదాపు అన్ని వంటకాల్లో కరివేపాకు వేస్తుంటారు. కూరగాయలు, పప్పు, అన్నం, కూరగాయలు ఇలా అన్నీ రకాల వంటకాలకు కరివేపాకు ప్రత్యేక రుచిని తీసుకువస్తుంది. కరివేపాకు ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

కరివేపాకులో కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. కరివేపాకును రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి అనేక రకాలుగా ఉపయోగిస్తారు.

బరువు తగ్గాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అందుకు డైటింగ్‌లో వివిధ పద్ధతులు వినియోగిస్తుంటారు. బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ ఉదయం 5-6 కరివేపాకులను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. కరివేపాకులో ఉండే డైక్లోరోమీథేన్, ఇథైల్ అసిటేట్ అనే పదార్థాలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

కరివేపాకులో కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారు తప్పనిసరిగా కరివేపాకు తినాలి. కరివేపాకులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఐరన్ రెండూ రక్తాన్ని వృద్ధి చేస్తాయి.

కరివేపాకులో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. హైపోగ్లైసీమిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే మధుమేహం ఉన్నవారు కరివేపాకును తప్పనిసరిగా తీసుకోవాలి. హైపోగ్లైసీమిక్ రక్తంలో షుగర్ పెరుగుదలను నియంత్రణలో ఉంచుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.




