Viral: పండ్ల లారీయే అనుకున్నారు.. కట్ చేస్తే.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా..
లారీ నిండా ఫ్రూట్స్ బాక్స్ ఉన్నాయి.. దీంతో ఆ లారీ ఫ్రూట్స్ రవాణా చేసేది అనుకున్నారు.. అయితే.. అక్కడే మరో ట్విస్ట్ ఉంది.. పండ్ల మాటున మరెదో జరుగుతుంది.. పక్కా స్కెచ్‌తో గంజాయ్ అక్రమ రవాణా జరుగుతోంది.. పండ్ల లోడు మాటున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.. దీంతో వెంటనే అప్రమత్తం అయ్యారు. కాపుకాశారు.. లారీని ఆపి చెక్ చేశారు..
లారీ నిండా ఫ్రూట్స్ బాక్స్ ఉన్నాయి.. దీంతో ఆ లారీ ఫ్రూట్స్ రవాణా చేసేది అనుకున్నారు.. అయితే.. అక్కడే మరో ట్విస్ట్ ఉంది.. పండ్ల మాటున మరెదో జరుగుతుంది.. పక్కా స్కెచ్‌తో గంజాయ్ అక్రమ రవాణా జరుగుతోంది.. పండ్ల లోడు మాటున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.. దీంతో వెంటనే అప్రమత్తం అయ్యారు. కాపుకాశారు.. లారీని ఆపి చెక్ చేశారు.. దీంతో ఒక్కసారిగా గంజాయ్ గుప్పుమంది.. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఒడిశా బోర్డర్‌లో (ఏఓబి) అంతర్రాష్ట్ర గంజాయి వ్యాపారిని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. కలిమెలా బెజ్జం గూడ మీదుగా హైదరాబాద్ కు ఐచర్ వ్యాన్‌లో రవాణా అవుతున్నట్టు గుర్తించి కలిమెలా పోలీసుల తనిఖీలు చేపట్టారు. 496 కిలోల గంజాయితో వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అఫ్సర్ మహబూబ్ అనే మహారాష్ట్ర స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. కటకటాల వెనక్కినెట్టారు.
ఏఓబిలో మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ ఆంధ్రా ఒడిస్సా మారుమూల పరిధిలో మహారాష్ట్రకు చెందిన షేక్ అప్సర్ మెహబూబ్ గంజాయిని కొనుగోలు చేసి ప్యాకెట్ల రూపంలో తయారుచేసి పండ్ల ట్రేలలో అమర్చి అక్రమ రవాణా చేస్తున్నారు. బెజ్జంగి గూడ నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కలిమెలా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని MH 24 AU 6851 నెంబర్ గల ఐచర్ వ్యాన్ ఆపి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పండ్ల ట్రేలలో భారీ ఎత్తున గంజాయిని గుర్తించారు. వెంటనే డ్రైవర్, అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వ్యాన్‌లో ఉన్న ట్రేలను కిందకు దింపగా 496 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని, ఐచర్ వ్యాన్ సీజ్ చేశారు. డ్రైవర్ తో పాటు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ షేక్ అప్సర్ మెహబూబ్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో విచారిస్తామని కళిమెలా పోలీసులు వెల్లడించారు.
ఇటీవల కాలంలో పుష్ప సినిమా తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న అక్రమార్కులను పోలీసులు ఇటీవల పట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ పండ్ల లారీ వ్యవహారం.. చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..