AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఢీ.. నలుగురు విద్యార్థులు మృతి.. 16 మందికి గాయాలు

ఉసావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవిగంజ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మయూన్‌కు చెందిన ఎస్‌ఆర్‌పీఎస్‌ స్కూల్‌ వ్యాన్‌, సత్యదేవ్‌ ఇంటర్‌ కళాశాల బస్సు విద్యార్థులను తీసుకురావడానికి ఉదయం ప్రాంతంలోని వివిధ గ్రామాలకు వెళ్లాయి. రెండు వాహనాలు తమ తమ విద్యార్థులతో తిరిగి పాఠశాలకు వస్తుండగా నవిగంజ్ సమీపంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సోమవారం ఉదయం 8.44 గంటలకు జరిగింది.

స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఢీ.. నలుగురు విద్యార్థులు మృతి.. 16 మందికి గాయాలు
Badaun Accident
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 30, 2023 | 5:19 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బదౌన్‌లో స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, స్కూల్ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. 16 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను స్కూల్ వ్యాన్‌ నుంచి దింపి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఉసావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవిగంజ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మయూన్‌కు చెందిన ఎస్‌ఆర్‌పీఎస్‌ స్కూల్‌ వ్యాన్‌, సత్యదేవ్‌ ఇంటర్‌ కళాశాల బస్సు విద్యార్థులను తీసుకురావడానికి ఉదయం ప్రాంతంలోని వివిధ గ్రామాలకు వెళ్లాయి. రెండు వాహనాలు తమ తమ విద్యార్థులతో తిరిగి పాఠశాలకు వస్తుండగా నవిగంజ్ సమీపంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సోమవారం ఉదయం 8.44 గంటలకు జరిగింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు

గాయపడిన స్టూడెంట్స్ లో 8 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి  సమాచారం అందిన వెంటనే డేటాగంజ్ ఎస్‌డిఎం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం నుంచి SDM సమాచారం తీసుకుంది. రెండు వాహనాలు అతివేగంగా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. డీఎం మనోజ్‌కుమార్‌, ఎస్‌ఎస్పీ డాక్టర్‌ ఓపీ సింగ్‌ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు.  గాయపడిన విద్యార్థులను పరామర్సించి వారికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు డీఎం మనోజ్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదం ఎందుకు జరిగిందంటే..

అన్ని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.  సంఘటన స్థలంలోనే  స్కూల్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. అతని పేరు ఒమేంద్ర అని చెప్పారు. అతని వయస్సు 28 సంవత్సరాలు. అదే సమయంలో ఈ ప్రమాదంలో హర్షిత్ (9), ఖుషి (6), పారుల్‌తో పాటు మరో విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయారు. స్కూల్ వ్యాన్‌లో 20 మంది విద్యార్థులున్నారు.. రోడ్డుపై గుంతలు ఉన్నాయని.. అదే సమయంలో వేగంగా వస్తున్న రెండు వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయని చూసినవారు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు