Andhra Pradesh: ఏఓబిలో బాలింత ఆత్మహత్యా యత్నం.. ప్రాణం కాపాడి మానవత్వం చాటుకున్న జవాన్లు.
ఏఓబిలో కుటుంబ కలహాలతో విషం తాగిన బాలింతను బిఎస్ఎఫ్ జవాన్లు బోట్ లో బలిమెల రిజర్వాయర్ దాటించి చిత్రకొండ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఆమె ప్రాణాన్ని బిఎస్ఎఫ్ జవాన్లు కాపాడారు. విషం తాగిన బాలింతను కాపాడి మానవత్వం చాటుకున్నారని ఈ ప్రాంతీయులు బిఎస్ఎఫ్ జవాన్లను కొనియాడారు.
కుటుంబ కలహాలతో గత రాత్రి విషం తాగింది పాన్ పాంగి అనే బాలింత. నిస్సహాయ స్థితిలో బిఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇచచ్చాడు భర్త మదన్. వెంటనే స్పందించిన జవాన్లు హుటాహుటిన విషం తాగిన పాన్ పాంగి ని బోట్ లో బొడ ఫోధర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేయించి.. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్ లో చిత్రకొండ ఆస్పత్రికి తరలించారు. జవాన్లు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది బాలింత. మల్కన్ గిరీ జిల్లా చిత్రకొండ బ్లాక్ దిసరి గూడ లో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే…
ఏఓబిలో కుటుంబ కలహాలతో విషం తాగిన బాలింతను బిఎస్ఎఫ్ జవాన్లు బోట్ లో బలిమెల రిజర్వాయర్ దాటించి చిత్రకొండ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఆమె ప్రాణాన్ని బిఎస్ఎఫ్ జవాన్లు కాపాడారు. విషం తాగిన బాలింతను కాపాడి మానవత్వం చాటుకున్నారని ఈ ప్రాంతీయులు బిఎస్ఎఫ్ జవాన్లను కొనియాడారు. ఏఓబి లోని మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ దిసరి గూడ గ్రామానికి చెందిన మదన్ పాంగి, పాన్ పాంగి భార్యాభర్తలు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రాత్రి గర్భిణీ అయిన పాన్ పాంగి విషం తాగింది. ఈ విషయాన్ని భర్తతో పాటు గ్రామస్తులు అక్కడే ఉన్న బిఎస్ఎఫ్ జవాన్లకు తెలియజేశారు.
వెంటనే బిఎస్ఎఫ్ జవాన్ వారి బోటులో బలిమెల రిజర్వాయర్ దాటి బొడ ఫోదర్ లో ఉన్న కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం జవాన్లు ఆమెను అంబులెన్స్ లో చిత్రకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించడంతో పాన్ పాంగి ఆరోగ్యం నిలకడగా ఉంది ఆమెకు ప్రాణాపాయము తప్పిందని డాక్టర్లు తెలిపారు. విషం తాగిన పాన్ పాంగి నీ బిఎస్ఎఫ్ కమాండెంట్ కమల్ కుల్బే పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో తాము ప్రజలకు సేవలు అందించడానికి ఉన్నామని కమాండెంట్ తెలిపారు. పాన్ పాంగి ప్రాణాలు కాపాడిన బిఎస్ఎఫ్ జవాన్లను ఈ ప్రాంత గిరిజనులు కొనియాడారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..