Guntur: కురవని వానలు.. అందని సాగు నీరు.. పంటలు పీకేస్తున్న రైతులు..
పల్నాడులో మాత్రం సాగు నీటి కొరత అధికంగా ఉంది. సాగర్ లో నీరు కనీస మట్టానికి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులో వరి సాగు చేయవద్దని సూచించింది. ఆరు తడి పంటలకు మాత్రమే ఈ ఏడాది వారబందీ పద్దతిలో నీరు ఇస్తామని ప్రకటించింది. దీంతో చాలా చోట్ల రైతులు మిర్చి సాగు చేశారు. అయితే ప్రస్తుతం సాగర్ కాలువల ద్వారా ఆరు తడులకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
ఆరుగాలం కష్టంచి పనిచేసే రైతన్నకు మధ్యలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది రెయినీ సీజన్ లో కూడా తగినంత వర్షాలు లేవు. దీంతో సాగు నీటి ప్రాజెక్ట్ ల్లో నీరు నిల్వ కాలేదు. పంటలు పండించేందుకు అవసరమైన నీటికి రైతులు ఎదురు చూపులు చూశారు. వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా నీరు రాక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు, డెల్టా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. డెల్టాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు. అయితే అటు డెల్టాలో టెయిల్ భూములకు, అప్ ల్యాండ్స్ కు నీరు అందటం లేదు. దీంతో కర్షకులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం ఒక పంటకు నీరు అందించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే అటు పులిచింతల నుండి ఇటు పట్టిసీమ నుండి నీటిని డెల్టా ప్రాంతానికి తరలిస్తున్నారు. దీంతో డెల్టాలో మొదటి పంటైనా చేతికొస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు.
ఇక పల్నాడులో మాత్రం సాగు నీటి కొరత అధికంగా ఉంది. సాగర్ లో నీరు కనీస మట్టానికి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులో వరి సాగు చేయవద్దని సూచించింది. ఆరు తడి పంటలకు మాత్రమే ఈ ఏడాది వారబందీ పద్దతిలో నీరు ఇస్తామని ప్రకటించింది. దీంతో చాలా చోట్ల రైతులు మిర్చి సాగు చేశారు. అయితే ప్రస్తుతం సాగర్ కాలువల ద్వారా ఆరు తడులకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
పెదకూరపాడుకు చెందిన పమిడాల వెంకట్రావు అనే రైతు ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఎకరానికి ఇప్పటికే యాబై వేల రూపాలయ వరకూ ఖర్చు చేశాడు. అయితే మిర్చి మొక్కలు ఎదుగుతున్న సమయంలో సాగు నీరు అందలేదు. చుట్టు పక్కల బోరు బావుల నుండి నీటిని పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. వర్షాలు కూడా లేకపోవడంతో మిర్చి మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో కళ్ల ముందే పంటలు ఎండి పోవటాన్ని తట్టుకోలేక ఐదు ఎకరాల్లో పంటను పీకేశాడు. ట్రాక్టర్ తో దుక్కి దున్నించాడు. దాదాపు నెల రోజులుగా సాగు నీటికి కోసం ఎదురు చూస్తున్నామని ఇంక పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక మిర్చి తోటను పీకేసినట్లు తెలిపాడు.
పల్నాడులోని చాలా ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. మరోక పదిపదిహేను రోజుల్లో వర్షం పడకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులుంటాయని రైతులు అంటున్నారు. మిర్చి పంట ఈ ఏడాది చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..