Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అమెరికాలో డైనోసార్ ఎముకలను దొంగలించి చైనాకు అమ్మకం.. 25 కోట్లు మోసం చేసిన నలుగురు వ్యక్తులు..

యుఎస్ అటార్నీ కార్యాలయం నలుగురూ పురాజీవ వనరుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ నలుగురు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా డైనోసార్ శిలాజాలను పొందారని ఆరోపించారు. ఆ తర్వాత చైనాకు విక్రయించారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Viral News: అమెరికాలో డైనోసార్ ఎముకలను దొంగలించి చైనాకు అమ్మకం.. 25 కోట్లు మోసం చేసిన నలుగురు వ్యక్తులు..
Dinosaur Bones
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2023 | 2:03 PM

నలుగురు వ్యక్తులు కలిసి అమెరికాను రూ.25 కోట్ల మేర మోసం చేశారు. ఈ నలుగురు 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన డైనోసార్ ఎముకలను దొంగిలించి చైనాకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిందితులు చేసిన పనితో శిలాజాల వాణిజ్య, శాస్త్రీయ విలువలతో కలిపి దేశానికి 3 మిలియన్ డాలర్లకు పైగా (అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 25 కోట్లు) నష్టం వాటిల్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Utah కి చెందిన యుఎస్ అటార్నీ ఆఫీసు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. నిందితులు వింట్ వేడ్, డోనా వేడ్, స్టీవెన్ విల్లింగ్ , జోర్డాన్ విల్లింగ్ లు కలిసి పాలియోంటాలాజికల్ రిసోర్సెస్ ప్రిజర్వేషన్ యాక్ట్ (PRPA)ని ఉల్లంఘించారు. డైనోసార్‌ శిలాజాలకు చెందిన రాళ్లు, ఎముకలు దొంగలించి వాటిని అక్రమంగా దేశం దాటించారని అనంతరం తమ నేరం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించారు. అలా దొంగలించిన డైనో సార్ కు చెందిన శిలాజాలను తర్వాత చైనాకు విక్రయించారు.

ఇవి కూడా చదవండి

అమెరికా నుంచి దొంగిలించి చైనాకు విక్రయం

ఈ నలుగురు కలిసి మార్చి 2018 నుంచి మార్చి 2023 మధ్య ప్రభుత్వ భూముల్లో అక్రమంగా డైనోసార్ ఎముకలను తవ్వి తీశారు. అనంతరం వాటిని చైనాకు అక్రమంగా ఎగుమతి చేశారు. ఈ భూమిలో దొరికిన వాటిల్లో జురాసిక్ కాలం నాటి ఎముకలు, శిలాజాలు.. ఇతర శిలాయుగానికి చెందినవి ఉన్నాయి.

 అమ్మిన శిలాజాలు

డైనోసార్ ఎముకలు చోరీ

సాల్ట్ లేక్ సిటీలోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ వారు నలుగురిపై $1 మిలియన్ కంటే ఎక్కువ విలువైన పురాతన వనరులను కొనుగోలు చేసి విక్రయించినట్లు అభియోగాలు మోపారు. వారి నుంచి 1.5 లక్షల పౌండ్ల విలువైన పురాతన శిలాజాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో డైనోసార్ ఎముకలు కూడా ఉన్నాయి, ఇవి ఆగ్నేయ ఉటా నుండి అక్రమంగా సేకరించినట్లు వెల్లడించారు.

PRPA చట్టం అంటే ఏమిటంటే

పాలియోంటాలాజికల్ రిసోర్సెస్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం పురావస్తు వనరులు అంటే శిలాజ అవశేషాలు, భూమిపై ఉన్న సంరక్షించబడిన జీవుల జాడలు లేదా ముద్రలు పురావస్తు ప్రాముఖ్యతతో పాటు భూమిపై జీవిత చరిత్ర గురించి సమాచారాన్ని అందిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..