10 నిమిషాల్లో పెళ్లి… పెళ్లి వద్దంటూ 100 కి డయల్ చేసిన వరుడు !!
మరో 10 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అంతలో పెళ్లి కొడుకు షాకిచ్చాడు. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆగ్రహం తో ఊగిపోయారు. ఎక్కడ తనపై దాడి చేసి కొడతారని భావించి వరుడు నేరుగా బాత్ రూం కు వెళ్లి లోపల గడియ పెట్టుకున్నాడు. డయల్ 100 కి ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు కళ్యాణ మండపానికి చేరుకుని వరుడిని స్టేషన్ కు తీసుకెళ్లారు.
మరో 10 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అంతలో పెళ్లి కొడుకు షాకిచ్చాడు. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆగ్రహం తో ఊగిపోయారు. ఎక్కడ తనపై దాడి చేసి కొడతారని భావించి వరుడు నేరుగా బాత్ రూం కు వెళ్లి లోపల గడియ పెట్టుకున్నాడు. డయల్ 100 కి ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు కళ్యాణ మండపానికి చేరుకుని వరుడిని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇరు వర్గాల బంధువులు కూడా చేరుకోవడం తో సీన్ స్టేషన్ కు మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. విశాఖ నగరానికి చెందిన యువతితో, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువకుడికి వివాహం కుదిరింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట కు క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహం కుదిరిన తర్వాత ఓ నెల రోజుల నుంచి ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు.. తాజాగా ఆ అబ్బాయి ఫోన్ చేసిన సందర్భంలో ఒకటి రెండు సార్లు వధువు ఫోన్ లిఫ్ట్ చేయలేదట. అప్పట్నుచి మనసులో పెట్టుకున్న పెళ్లి కొడుకు ఆమెతో సరిగా మాట్లాడడం లేదట. అలా ముభావం గానే ఉంటూ పెళ్లి పీటల పై దాకా వచ్చిన వ్యవహారాన్ని సడన్ గా నిలిపి వేశాడని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Skanda OTT: బ్యాడ్ న్యూస్.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా
Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్
Chiranjeevi: ముల్లోకాలను శాసించే విశ్వంభర..
అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్.. నేషనల్ లెవల్లో అదరగొట్టిన హైద్రాబాదీ
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

