Viral News: దత్తత తీసుకున్న కొడుకుని పెళ్లి చేసుకున్న మహిళ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

మహిళ వయస్సు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అయితే ఆ మహిళ వివాహం చేసుకున్న వ్యక్తి వయస్సు 22 సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం 31 సంవత్సరాలు. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ కథనం ప్రకారం మహిళ తన సొంత రాష్ట్రం టాటర్‌స్థాన్‌. ఇక్కడ ఈ వింత వివాహం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Viral News: దత్తత తీసుకున్న కొడుకుని పెళ్లి చేసుకున్న మహిళ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Mum Marries Adopted Son
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2023 | 2:05 PM

ఎవరైనా సరే అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం చాలా పుణ్య కార్యంగా పరిగణిస్తారు. అనాథ పిల్లలను దత్తత తీసుకుని సొంత పిల్లల్లా పెంచి, చదువులు నేర్పించి, సమర్ధులుగా తీర్చిదిద్దే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే రష్యాలో వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ  విషయం తెలిసి కూడా జనాలు నమ్మలేకపోతున్నారు. అసలు విషయం తెలిస్తే.. తెలుగులో ఓ సినిమా స్టోరీని గుర్తు చేస్తుంది మరి. ఓ సినిమాలో కోటా శ్రీనివాస్ రావు అనాథాశ్రమం నుంచి ఓ బాలికను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి తాను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇదే విధంగా రష్యాకు చెందిన ఓ మహిళ ఓ పిల్లాడిని  దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకుంది.

మహిళ వయస్సు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అయితే ఆ మహిళ వివాహం చేసుకున్న వ్యక్తి వయస్సు 22 సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం 31 సంవత్సరాలు. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ కథనం ప్రకారం మహిళ తన సొంత రాష్ట్రం టాటర్‌స్థాన్‌. ఇక్కడ ఈ వింత వివాహం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

14 ఏళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న మహిళ

ఆ మహిళ టాటర్‌స్తాన్‌కు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు. ఐసీలు చిజెవ్‌స్కాయా -మింగలిమ్. నివేదిక ప్రకారం 8 సంవత్సరాల క్రితం అనాధ శరణాలయాల్లో సంగీతం నేర్పుతున్న సమయంలో ఐసిలు 13 ఏళ్ల బాలుడు డేనియల్‌ను కలుసుకున్నాడు. ఐసిలు డేనియల్‌ అభిరుచిని గుర్తించి అతనికి సంగీతం నేర్పడంలో సహాయం చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో డేనియల్ అనేక రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నాడు. అతనికి 14 ఏళ్లు వచ్చినప్పుడు ఐసిలు అతన్ని దత్తత తీసుకున్నది. అప్పటి నుండి వారు సహజీవనం చేస్తున్నారు, అయితే అక్టోబర్ 20 న వీరిద్దరూ చట్టబద్ధంగా ఒకరినొకరు వివాహం చేసుకోవడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.

వాస్తవంగా మారిన పుకారు

డేనియల్‌తో తన రిలేషన్‌షిప్ గురించి చాలా కాలంగా పుకార్లు ఉన్నాయని.. అందుకే ఈ పెళ్లితో ఆ పుకార్లన్నింటికీ స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నానని ఐసీలు తెలిపింది. అయితే తమ వివాహానికి నిజమైన అర్ధం వేరని.. తమ వివాహం నిజమైనది కావచ్చు.. కానీ దీనికి ఆధ్యాత్మిక స్వభావం మాత్రమే ఉందని..  భౌతికమైనది కాదని పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు