Parrot Viral Video: బాగా ఆకలిమీదున్న పంజరంలో చిలుక.. ఏం చేసిందో చూస్తే మురిసిపోతారు.. వైరలవుతున్న వీడియో
ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతున్న ఈ పోస్ట్‌కు 1 లక్ష 92 వేల వీక్షణలు, ఒకటిన్నర వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు వీడియోపై స్పందించారు. ఈ క్లిప్ చాలా క్యూట్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యనించారు. ఈ చిలుక మరాఠీలో మా బాగా మాట్లాడుతుందేనని అంటున్నారు. చిలుక ఈ శైలిని చూసిన చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.
చిలుకలు చాలా ముద్దుగా ఉంటాయి. అవి ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే ఎంత సమయమైన సరే.. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. అందుకే కొందరు చిన్నారులు మాట్లాడే మాటలను చిలుకపలుకు అని పోలుస్తుంటారు. చిలుక జ్యోతిష్యం కూడా బాగా ఫేమస్..అయితే, ఇంతకీ ఇప్పుండేందుకీ చిలుక జోస్యం అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.. చిలుకల ప్రత్యేకత ఏంటంటే..అవి మనుషుల్లాగే మాట్లాడతాయని మనందరికీ తెలిసిందే..కానీ, వాటికి సరైన శిక్షణ ఇస్తే..అవి ఏ భాషలోనైనా చాలా స్పష్టంగా మాట్లాడతాయి.. ఒకానొక సమయంలో చిలుక మాట్లాడుతోందా లేదా మనిషి మాట్లాడుతున్నాడా.. అని కూడా తికమకపడాల్సిందే..! చిలుకలు మాట్లాడుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలానే వైరల్ అయ్యాయి. కానీ, ప్రస్తుతం ఆకలితో ఉన్న చిలుక ఇంటర్నెట్‌కు నిప్పు పెట్టింది. అవును, ఈ చిలుకకు ఆకలిగా ఉంది.. కాబట్టి అతను అరవడం, ఆహారం కోసం గట్టి గట్టిగా అడగడం మొదలుపెట్టింది. దీన్ని ఎవరో కెమెరాలో బంధించడంతో వీడియో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న ఈ వీడియో అక్టోబర్ 26న @ChapraZila హ్యాండిల్‌తో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో పోస్ట్ చేయబడింది. క్యాప్షన్‌లో ఇలా రాశారు..చిలుక కూడా బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టమని అడగడం నేర్చుకుంది.. అని. ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతున్న ఈ పోస్ట్‌కు 1 లక్ష 92 వేల వీక్షణలు, ఒకటిన్నర వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు వీడియోపై స్పందించారు. ఈ క్లిప్ చాలా క్యూట్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యనించారు. ఈ చిలుక మరాఠీలో మా బాగా మాట్లాడుతుందేనని అంటున్నారు. చిలుక ఈ శైలిని చూసిన చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.
तोता भी भूख लगने पर अपना खाना मांग कर खाना सिख गया हैं। 😂😍 pic.twitter.com/3pt3VPGHCc
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 26, 2023
ఈ వీడియో నిడివి 7 సెకన్లు మాత్రమే. ఇందులో ఒక చిలుక పంజరంలోంచి మెడను బయటకు పెట్టి కనిపించింది. అలా బయటకు తలపెట్టి ఉన్న ఆ చిలుక.. సడెన్‌గా అరవటం మొదలుపెట్టింది. మమ్మీ… ఓ మమ్మీ… మిట్టుకి ఫుడ్ ఇవ్వు మమ్మీ.. అంటోంది. ఇలా ఆహారం అడిగే చిలుకను మీరు ఎప్పుడైనా చూశారా? అవును అయితే, కామెంట్‌లో మీ చిలుక పలుకులు ఎలా ఉంటాయో మాతో షేర్ చేసుకోండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..