Viral News: తాగేనీరు పేరుతో జుగుప్సాకరమైన పనిచేసిన హోటల్ సిబ్బంది.. షాక్ తిని కేసు పెట్టిన మహిళ
కొన్ని చోట్ల హోటల్ గదులు సరిగా లేవని, కొన్ని చోట్ల తిండి సరిగా లేదని ఇలాంటి కంప్లెయింట్స్ తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ హోటల్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అది ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ హోటల్‌లో ఓ మహిళకు నీళ్ల పేరుతో అత్యంత జుగుప్సాకరమైన నీటిని తాగించి షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన కస్టమర్ హోటల్ సిబ్బందిపై కేసు పెట్టాడు.
ఎప్పుడైనా, ఎక్కడికైనా విహారయాత్రకు వెళితే.. ఎవరైనా సరే ఖచ్చితంగా ఎక్కడో ఒక హోటల్‌లో బస చేస్తారు. సాధారణంగా మంచి హోటళ్లను ఎంచుకుని అప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఎంత ఎంక్వయిరీ చేసినా కూడా కొన్ని సార్లు మోసపోతారు. కొన్ని చోట్ల హోటల్ గదులు సరిగా లేవని, కొన్ని చోట్ల తిండి సరిగా లేదని ఇలాంటి కంప్లెయింట్స్ తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ హోటల్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అది ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ హోటల్‌లో ఓ మహిళకు నీళ్ల పేరుతో అత్యంత జుగుప్సాకరమైన నీటిని తాగించి షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన కస్టమర్ హోటల్ సిబ్బందిపై కేసు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ ఘటన గత ఏడాది నవంబర్ లో చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలో ఉన్న రిట్జ్-కార్ల్టన్ హోటల్‌కి ఓ జంట వెళ్లింది. అక్కడ నాలుగు రోజులు హోటల్‌లో బస చేశారు. అయితే తనకు ఆ హోటల్ లో ‘వీర్యం కలిపిన నీరు’ తాగేలా చేశారని ఆ మహిళ పేర్కొంది. అంతేకాదు తనను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాదు, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభకు గురిచేశారని, హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం, కన్సార్టియం నష్టానికి గాను ఆ మహిళ హోటల్ యజమానులపై దావా వేసింది.
విచారణలో దొరికిన వాటర్ బాటిల్‌లో వీర్యం
నవంబర్ 18, 2022 రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ జంట హోటల్ కి సంబంధించిన డెస్క్‌కి కాల్ చేసి వాటర్ బాటిల్ ని పంపించమని చెప్పారు. అప్పుడు హోటల్ ఉద్యోగి కొద్ది క్షణాల్లోనే వాటర్ బాటిల్ పంపినట్లు పేర్కొందని మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొంది. ఆ మహిళ వాటర్ బాటిల్ మూత తెరిచి సిప్ చేయగానే నీటిలో ఏదో లోపం ఉందని గ్రహించింది. వేంటనే ఆ మహిళ హోటల్ ఫ్రంట్ డెస్క్‌తో మాట్లాడి పోలీసులను పిలవాలని కోరింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. ఆ మహిళ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అప్పుడు పోలీసులు ఆ వాటర్ బాటిల్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపగా.. ఆ నీటిలో వీర్యం కలిపినట్లు వెల్లడైంది.
హోటల్ తీవ్ర నిర్లక్ష్యంపై ఆరోపణలు
ఈ పనిని హోటల్ ఉద్యోగి చేసి ఉంటాడని.. నిందితుడి ఉద్దేశ్యం ‘తీవ్రమైన మానసిక క్షోభ’ కలిగించడమేనని దావాలో పేర్కొన్నారు. అతని ఈ చర్య వల్ల ఆ జంట షాక్ అవ్వడమే కాకుండా చాలా ఇబ్బందిపడ్డారు. రిట్జ్-కార్ల్టన్ యాజమాన్యం తన ఉద్యోగి చేసిన ఈ అసహ్యకరమైన చర్యను విస్మరించారని.. ఇది వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని ఆరోపించారు. హోటల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలంటూ దావాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణకు వచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..