Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel-Hamas War:బందీల్లో జర్మన్ అమ్మాయిని పొట్టనబెట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు.. డెడ్ బాడీ ఊరేగింపుతో పైశాచిక ఆనందం

షానీ లౌక్ తల్లి రికార్డా జర్మన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ తన కూతురు బతికి లేదనే వార్త ఆదివారం తమకు అందిందని తెలిపింది. ఇప్పుడు లాక్ చనిపోయినట్లు ప్రకటించారని తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌ నివేదిక ప్రకారం ఈ జర్మన్ అమ్మాయి మృతదేహం ఇంకా గాజాకు తిరిగి రాలేదని పేర్కొంది.  అంతకుముందు జర్మన్ అమ్మాయి బంధువు తోమసినా బెంట్రాబ్ లౌక్ షానీ లౌక్ సజీవంగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Israel-Hamas War:బందీల్లో జర్మన్ అమ్మాయిని పొట్టనబెట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు.. డెడ్ బాడీ ఊరేగింపుతో పైశాచిక ఆనందం
German Girl Dead
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2023 | 6:15 PM

ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్‌కు గురైన జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్ మరణించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సందర్భంగా హమాస్ ఉగ్రవాదులు ఆమెను అపహరించారు. లౌకి ధరించిన బట్టలు ఆధారంగా ఆమె తల్లి గుర్తించారు. ఇప్పుడు షానీ లౌకి మరణాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇజ్రాయెల్‌లో జరిగిన ట్రైబ్ ఆఫ్ సూపర్‌నోవా కచేరీలో జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్ పాల్గొన్నారు. ఈ సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో దాడి చేశారు. ఈ దాడిలో ఉగ్రవాదులు షానీ లౌక్‌ను కిడ్నాప్ చేశారు అనంతరం గాజాలో సాయుధ ఉగ్రవాదులతో నిండిన వీడియోలు వైరల్ కాగా.. అందులో ఒక వీడియోలో ఒక యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ యువతి తల్లి రికార్డా తన కూతురు శరీరంపై ఉన్న పచ్చబొట్లు, రంగు వేసిన జుట్టు ఆధారంగా గుర్తించింది.

కూతురు మరణంపై స్పందించిన తల్లి

షానీ లౌక్ తల్లి రికార్డా జర్మన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ తన కూతురు బతికి లేదనే వార్త ఆదివారం తమకు అందిందని తెలిపింది. ఇప్పుడు లాక్ చనిపోయినట్లు ప్రకటించారని తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌ నివేదిక ప్రకారం ఈ జర్మన్ అమ్మాయి మృతదేహం ఇంకా గాజాకు తిరిగి రాలేదని పేర్కొంది.  అంతకుముందు జర్మన్ అమ్మాయి బంధువు తోమసినా బెంట్రాబ్ లౌక్ షానీ లౌక్ సజీవంగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్పందించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం

జర్మన్ టాటూ ఆర్టిస్ట్ మరణంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఆమెను ముందుగా ఉగ్రవాదులు చిత్రహింసలు పెట్టి గాజా చుట్టూ ఊరేగించారని ఈ సంఘటన చాలా భయానకంగా ఉంది అది చూసి తమ హృదయం బాధతో నిండిపోయిందని పేర్కొంది. ఇది భయంకరమైన సంఘటన అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

షానీ క్రెడిట్ కార్డ్

జర్మన్ టాటూ ఆర్టిస్ట్ కిడ్నాప్ చేయబడిన ఇజ్రాయెల్ కచేరీ హమాస్ ఉగ్రవాదుల దాడి చేసిన మొదటి ప్రదేశాలలో ఒకటి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు తాము చేసిన బందీలను ఊరేగించిన వీడియో  వైరల్‌ చేశారు. షాని తల్లి బ్యాంక్ నుండి అందిన సమాచారం ప్రకారం..  షాని క్రెడిట్ కార్డ్ చివరిగా గాజాలో ఉపయోగించారని పేర్కొంది. తన కూతురుని దోచుకున్న ఉగ్రవాదులు క్రెడిట్ కార్డును ఉపయోగించారని వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..