AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పులికి గొలుసు కట్టిమరీ షికారుకు తీసుకుని వెళ్లిన యువకుడు.. నెట్టింట్లో వీడియో వైరల్..

గొలుసు కట్టిన పులితో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాకిస్థాన్ కు చెందినదిగా తెలుస్తోంది. 'టిప్‌టాప్‌యాత్ర' ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడిన వీడియో.. ప్రస్తుతం ప్రజల భద్రత, పులి సంక్షేమం గురించి ఆందోళనలను పెంచింది. అంతే కాదు వీడియోలో పులి రెచ్చిపోయి గొలుసు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

Viral Video: పులికి గొలుసు కట్టిమరీ షికారుకు తీసుకుని వెళ్లిన యువకుడు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Tiger Viral Video
Surya Kala
|

Updated on: Oct 27, 2023 | 8:21 PM

Share

ఇప్పటి వరకూ పెంపుడు జంతువులు అంటే కుక్కలు, పిల్లులు, ఆవులు వంటివి.. ఈ జంతువులను పెంచు కోవడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. కొందరు అయితే ఏకంగా కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ .. సొంతం ఇంటి మనుషుల్లా చూసుకుంటారు. తమ పెంపుడు కుక్కలకు గొలుసు కట్టి రోడ్డు మీద షికారు చేస్తూ ఉంటారు. అయితే ఓ యువకుడు ఏదో పెంపుడు జంతువు కుక్క పిల్లను పెంచుకుంటున్నట్లు పులి పెంచుకుంటున్నాడు. పులికి గొలుసు కట్టి ఏకంగా రోడ్డు మీదకు షికారు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

గొలుసు కట్టిన పులితో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాకిస్థాన్ కు చెందినదిగా తెలుస్తోంది. ‘టిప్‌టాప్‌యాత్ర’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడిన వీడియో.. ప్రస్తుతం ప్రజల భద్రత, పులి సంక్షేమం గురించి ఆందోళనలను పెంచింది. అంతే కాదు వీడియోలో పులి రెచ్చిపోయి గొలుసు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో బ్యాంక్ ఆఫ్ ఖైబర్‌లో తీసినట్లు తెలుస్తోంది. చాలా వాహనాలు వెళ్తూ రద్దీగా ఉన్న రోడ్డుమీద ఓ వ్యక్తి  పులిని గొలుసుతో కట్టి.. దానిని పట్టుకుని షికారుకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

పులితో షైర్ కి వెళ్తున్న యువకుడు

View this post on Instagram

A post shared by Tip Top Yatra (@tiptopyatra)

ఈ వీడియో చూసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, “మనుషులు, జంతువుల భద్రత కోసం అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చుకోవడం ఇరువురికి మంచిది కాదు. ఇక అలంటి కౄర జంతువులను ఇలా రోడ్డుపైకి తీసుకురావడం మరింత ప్రమాదకరం.” మరొకరు.. ఈ వీడియో ఎక్కడిది? అసలు ఇలా పులిని పెంచుకోవడం చట్టబద్ధమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో