AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 100పైగా సర్జీలు చేయించుకుని బ్రిట్నీలా మారాలనుకున్న యువకుడు.. ఇప్పటికి వరకూ ఎంత ఖర్చు చేశాడంటే..

ఆ వ్యక్తి పేరు బ్రయాన్ రే. 35 ఏళ్ల వయస్సు... బ్రిట్నీ స్పియర్స్ ఒక ప్రసిద్ధ అమెరికన్ గాయని. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు బ్రియాన్. అమెరికాలోని కాలిఫోర్నియా నివాసి అయిన బ్రియాన్, బ్రిట్నీ స్పియర్స్‌కి ఆకర్షితుడయ్యాడు. ఆమె కనిపించాలని కోరుకున్నాడు. దీంతో అతను ఇప్పటివరకు 100కి పైగా సర్జరీలు చేయించుకున్నాడు.

Viral News: 100పైగా సర్జీలు చేయించుకుని బ్రిట్నీలా మారాలనుకున్న యువకుడు.. ఇప్పటికి వరకూ ఎంత ఖర్చు చేశాడంటే..
Britney Spears FanImage Credit source: Instagram/beeray416
Surya Kala
|

Updated on: Oct 27, 2023 | 9:34 PM

Share

ఇతరుల నుండి ప్రేరణ పొందడం మానవ సహజం. మరీ ముఖ్యంగా తమకు నచ్చిన సెలబ్రెటీలు అంటే నటులు, లేదా రాజకీయ నేతలు , క్రీడారంగానికి చెందిన వ్యక్తులను ప్రేరణగా తీసుకుని వారిలా ఉండాలనుకునేవారి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. తమకు నచ్చిన నటులు ధరించే దుస్తులు ధరించడం లేదా హెయిర్ స్టైల్ ను అనుకరించడం.. చీరలను ధరించడం వంటివి చూస్తూనే ఉన్నాం.. తమ అభిమాన తారలుగా కనిపించేందుకు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాళ్లు కూడా ప్రపంచంలోనే ఉన్నారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వార్తలో ఒక అభిమానికి తనకు నచ్చిన పాప్ సింగర్ లా కనిపించేందుకు లక్షలు ఖర్చు చేసినట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ అంశం ప్ర‌జ‌ల‌ను సైతం విస్మ‌య‌కు గురిచేస్తోంది. వాస్తవానికి, బ్రిట్నీ స్పియర్స్‌లా కనిపించడానికి ఒక వ్యక్తి శస్త్రచికిత్స కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశాడు.

ఆ వ్యక్తి పేరు బ్రయాన్ రే. 35 ఏళ్ల వయస్సు… బ్రిట్నీ స్పియర్స్ ఒక ప్రసిద్ధ అమెరికన్ గాయని. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు బ్రియాన్. అమెరికాలోని కాలిఫోర్నియా నివాసి అయిన బ్రియాన్, బ్రిట్నీ స్పియర్స్‌కి ఆకర్షితుడయ్యాడు. ఆమె కనిపించాలని కోరుకున్నాడు. దీంతో అతను ఇప్పటివరకు 100కి పైగా సర్జరీలు చేయించుకున్నాడు. ది సన్ నివేదిక ప్రకారం అతను తన ముక్కు, చెవులకు మాత్రమే కాదు చెంపలు, జుట్టు, కళ్ళకు కూడా శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

బ్రిట్నీ స్పియర్స్ లా ఎందుకు కనిపించాలనుకున్నాడంటే..

బ్రియాన్ తన జుట్టును లేజర్‌తో తొలగించుకున్నాడు. కనురెప్పలను కూడా షేప్ చేయించుకున్నాడు.  తద్వారా అతని కళ్ళు బ్రిట్నీ వలె పెద్దవిగా అందంగా కనిపించడం మొదలయ్యాయి. అంతే కాకుండా బుగ్గలకు ఇంజెక్షన్లు కూడా చేయించుకున్నాడు. తన లుక్ సరిగ్గా బ్రిట్నీ స్పియర్స్ లా మారే వరకు తాను శస్త్రచికిత్సలు చేసుకుంటూ ఉంటానని బ్రియాన్ చెప్పాడు. ప్రపంచంలోనే తనకు బ్రిట్నీ అంటే చాలా ఇష్టమని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఆమెలా కనిపించాలని కోరుకుంటున్నానని చెప్పాడు. శస్త్రచికిత్స తర్వాత అతను శస్త్రచికిత్స చేయించుకుంటూ ఉన్నాడు. తన లుక్ బ్రిట్నీ స్పియర్స్‌తో 99.9 శాతం సరిపోతుందని బ్రియాన్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మొదటి సారి శస్త్రచికిత్సకు 22 లక్షలు ఖర్చు చేసిన బ్రియాన్

నివేదికల ప్రకారం శస్త్రచికిత్స చేయించుకోవాలనే ఆలోచన మొదటి సారిగా బ్రియాన్ కు 17 ఏళ్ల వయసులో మొదటిసారి కలిగింది. అప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం అతని వయసు 35 ఏళ్లు. తన కొడుకు ఆలోచనకు బ్రియాన్ తల్లి మద్దతు ఇచ్చింది. మొదటిసారిగా సర్జరీ చేయించుకోవడానికి   22 వేల పౌండ్లు అంటే రూ.22 లక్షలకు పైగా ఖర్చు చేశాడు బ్రియాన్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..