Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: అరె ఎంట్రా ఇది.. అక్రమంగా తరలిస్తున్న 1000 పిల్లులు పట్టివేత.. విషయం తెలిస్తే షాకే..!

చైనాలో జోరుగా సాగుతున్న పిల్లి మాంసంలో అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు చైనీయులలో ఆహార భద్రత ఆందోళనలను కూడా తీవ్రతరం చేసింది. 600 గ్రాముల పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 52 రూపాయలు అని జంతు కార్యకర్తలు చెబుతున్నారు. పిల్లుల మాంసాన్ని పంది మాంసం గా లేదా మటన్ , సాసేజ్ లు గా అమ్ముతున్నారని..

China: అరె ఎంట్రా ఇది.. అక్రమంగా తరలిస్తున్న 1000 పిల్లులు పట్టివేత.. విషయం తెలిస్తే షాకే..!
China Police Rescues Cats
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2023 | 4:26 PM

చైనీయులు పంది, కుక్క, అది ఇది అని లేదు.. పాకేవి, ఈదేవి, ఎగిరేవి అంటే.. మనుషులను తప్ప ప్రతి జీవిని తింటారు అని సరదాగా అందరూ వ్యాఖ్యానిస్తారు. తాజాగా చైనాలో పిల్లుల్ని అక్రమంగా తరలిస్తున్న కొందరిని పోలీసులు పట్టుకున్నారు. ఓ ట్రక్కులో తరలిస్తున్న దాదాపు వెయ్యి మంది పిల్లుల్ని పోలీసులు కాపాడారు. ఈ పిల్లుల్ని చంపి వాటి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్‌గా విక్రయించే అవకాశం ఉందని వెల్లడించారు. జంతువుల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఓ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి వేలాది పిల్లుల ప్రాణాలను కాపాడారు. జాంగ్‌జియాగాంగ్‌ నగరంలో ఓ ట్రక్కులో తరలిస్తున్న పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు పిల్లుల ప్రాణాలను కాపాడి జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ఈ ఉదంతంతో చైనాలో జోరుగా సాగుతున్న పిల్లి మాంసంలో అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు చైనీయులలో ఆహార భద్రత ఆందోళనలను కూడా తీవ్రతరం చేసింది. 600 గ్రాముల పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 52 రూపాయలు అని జంతు కార్యకర్తలు చెబుతున్నారు. పిల్లుల మాంసాన్ని పంది మాంసం గా లేదా మటన్ , సాసేజ్ లు గా అమ్ముతున్నారని.. దేశంలోని దక్షిణ ప్రాంతానికి పిల్లుల మాంసాన్ని రవాణా చేస్తున్నారని పిల్లుల ప్రాణాలు కాపాడిన చైనా పోలీసులు చెప్పారు.

పంది మాంసంగా పిల్లుల మాంసం..

ఈ వందలాది పిల్లులు వాస్తవానికి ఎక్కడ నుండి తీసుకుని వచ్చారో తెలియలేదని చెప్పారు. ఇదే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే  పిల్లుల అక్రమ రవాణా గురించి వెల్లడికావడంతో చైనా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ తో నిండిపోతోంది. చైనా సోషల్ మీడియా వీబోలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రతపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్‌గా విక్రయించబోతున్నారని తెలియగానే వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఆహార చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్‌

ఆహార చట్టాలను మరింత కఠినతరం చేయాలని జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది Weibo వినియోగదారులు జంతు సంరక్షణ చట్టాలగురించి కూడా మరింత కఠిన తరం చేయాలని పేర్కొన్నారు. తద్వారా పిల్లులు, కుక్కల వంటి జంతువుల జీవితాలను రక్షించవచ్చు. ఇకపై రెస్టారెంట్ ఫుడ్ తినబోమని కొందరు సోషల్ మీడియాలో ప్రతిజ్ఞ కూడా చేశారు. చైనాలో కుక్క,పంది మాంసానికి సాధారణంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీటి మాంసంతో కొత్త రకాల వంటకాలు తయారు చేస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..