AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 7 ఏళ్ల వయసున్న సవతి కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకున్న మహిళ.. ఇప్పుడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు

రష్యాకు చెందిన ఆ మహిళ పేరు మెరీనా బల్మషేవా. ఆమె వయస్సు 37 సంవత్సరాలు. ఆమె వివాహం చేసుకున్న సవతి కుమారుడు వ్లాదిమిర్ షావిరిన్. అతని వయస్సు 23 సంవత్సరాలు. ఈ జంట ప్రస్తుతం ఉక్రెయిన్‌కు దగ్గరగా ఉన్న క్రాస్నోడార్‌లో నివసిస్తున్నారు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం, 47 ఏళ్ల అలెక్సీ షావిరిన్ మాట్లాడుతూ..తాను మెరీనా ను పెళ్లి చేసుకున్నానని.. అప్పుడు తనకు 7 ఏళ్ల కొడుకు వ్లాదిమిర్ షావిరిన్ ఉన్నాడని చెప్పాడు.

Viral News: 7 ఏళ్ల వయసున్న సవతి కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకున్న మహిళ.. ఇప్పుడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు
Woman Marries StepsonImage Credit source: Instagram/marina_balmasheva
Surya Kala
|

Updated on: Oct 29, 2023 | 4:27 PM

Share

మానవ సంబంధాల్లో కొన్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. వీటిని  ప్రపంచంలో అత్యంత అపురూపమైన బంధాలుగా భావిస్తారు. అలాంటి బంధంలో మొదటిగా గుర్తుకొచ్చేది తల్లి పిల్లల బంధం.. ఇక తల్లికి కొడుకు అంటే అపురూపమని.. తండ్రికి కూతురు అంటే ప్రాణం అని మన భారతీయులు మాత్రమే కాదు.. ఆసియాలోని ప్రముఖ దేశాల్లో కూడా ఇదే భావం ఉంది. అందుకనే  తల్లి-కొడుకు, తండ్రి-కుమార్తెల మధ్య సంబందాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు కూడా.. అయితే కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ సంబంధంలోని  పవిత్రతకు చెదలు పట్టినట్లు విమర్శలకు గురవుతుంది. ఇటీవల రష్యాలో ఒక మహిళ తాను దత్తత తీసుకుని పెంచుకున్న కొడుకుని పెళ్లి చేసుకున్న విషయం వెలుగులోకి రాగా ఇప్పుడు మరో బంధం  చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం గురించి తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే రష్యాకు చెందిన ఓ మహిళ తన సవతి కొడుకుని 7 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి పెంచింది. తర్వాత ఆ సవతి కొడుకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రష్యాకు చెందిన ఆ మహిళ పేరు మెరీనా బల్మషేవా. ఆమె వయస్సు 37 సంవత్సరాలు. ఆమె వివాహం చేసుకున్న సవతి కుమారుడు వ్లాదిమిర్ షావిరిన్. అతని వయస్సు 23 సంవత్సరాలు. ఈ జంట ప్రస్తుతం ఉక్రెయిన్‌కు దగ్గరగా ఉన్న క్రాస్నోడార్‌లో నివసిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన మెరీనా మొదటి భర్త

డైలీ స్టార్ నివేదిక ప్రకారం, 47 ఏళ్ల అలెక్సీ షావిరిన్ మాట్లాడుతూ.. తాను మెరీనా ను పెళ్లి చేసుకున్నానని.. అప్పుడు తాము అయిదుగురు పిల్లలను దత్తత తీసుకున్నామని వారి ఆలనాపాలనా చూసుకున్నామని చెప్పాడు. తనను మెరీనా పెళ్లి చేసుకున్న సమయంలో వ్లాదిమిర్ వయసు 7 ఏళ్లు అని అప్పటి  నుంచి అతడిని తన భార్య పెంచి పెద్దచేసిందని చెప్పాడు. అయితే వీరిద్దరి మధ్య ఆకర్షణ పెరిగి తాను ఇంట్లో ఉన్నప్పుడు కూడా.. తన భార్య మెరీనా, కుమారుడు వ్లాదిమిర్ శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. నేను నిద్రపోతున్నప్పుడు మెరీనా మా బెడ్‌రూమ్ నుండి మా అబ్బాయి బెడ్‌రూమ్‌కి వెళ్లి తిరిగి వచ్చి ఏమీ పట్టనట్లు పడుకునేది. నిజానికి వ్లాదిమిర్ షావిరిన్ తన కొడుకు కాకపోతే.. ఈ చర్యకు అతడిని నేను క్షమించి ఉండేవాడిని.. అయితే కొడుకు అయి ఉండి.. తనకు చేసిన ద్రోహాన్ని క్షమించలేకపోతున్నానని అలెక్సీ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జంట

పెళ్లి చేసుకున్న మెరీనా, వ్లాదిమిర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వివిధ రకాల పోస్ట్‌లను పోస్ట్ చేస్తూ ఉంటారు. నివేదికల ప్రకారం మెరీనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వ్లాదిమిర్‌ను ‘ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన నీలి కళ్లు గల వ్యక్తి’గా అభివర్ణించింది. తన సవతి కొడుకుని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

ఇలాంటి ఉదంతాలు గతంలో కూడా వెలుగులోకి

తాజాగా రష్యాలోనే ఇలాంటిదే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల వయసులో తాను దత్తత తీసుకుని పెంచిన అబ్బాయినే 53 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకుంది. తాతర్ స్థాన్ కు చెందిన ఓ మహిళ ఈ పెళ్లిపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..