Hyderabad: చెత్త కుప్ప కాదు – కరెన్సీ కట్ట.. వేస్ట్ టు వెల్త్.. ఉద్యానవనంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

తెలంగాణ ఏర్పాటు తర్వాత జవహర్ నగర్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడింది. 9 ఏళ్లలో అక్కడి రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. మొదట ప్రభుత్వం డంపింగ్ యార్డ్ మొత్తాన్ని క్యాపింగ్ చేసింది. అంటే మొత్తం కొండల మారిన చెత్తకుప్పను ప్లాస్టిక్ కవర్లతో కప్పేసింది. దీంతో కొంతమేరకు వాతావరణంలో కాలుష్యం తగ్గింది.

Hyderabad: చెత్త కుప్ప కాదు - కరెన్సీ కట్ట.. వేస్ట్ టు వెల్త్.. ఉద్యానవనంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
Jawaharnagar Dumpyard Yard
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Surya Kala

Updated on: Oct 30, 2023 | 8:42 PM

భాగ్యనగరంలోని జవహర్ నగర్.. ఈ పేరు వెంటనే ముక్కు మూసుకునే పరిస్థితి. అటువైపు వెళ్లాలంటేనే కరోనా కంటే ముందే మాస్కులు పెట్టుకునే సిచువేషన్. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన చెత్తంతా అక్కడే డంపింగ్. రోజుకు 6000 మెట్రిక్ట్ టన్నుల చెత్తను అక్కడికి తరలించేవారు. కొన్ని దశాబ్దాలుగా చెత్తను వేసి అక్కడ చెత్త కుండలు కాస్త చెత్త కొండలుగా మారిపోయాయి. ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ ఆ కొండలు కనిపిస్తాయి. చూసిన వాళ్లంతా వాటిని ఏవో గుట్టలు కావచ్చు అని భ్రమపడతారు. దగ్గరికి వెళ్లి చూస్తే భరించడానికి కంపుతో బాధపడతారు.

ఇక చుట్టు పక్కల నివసించే 50 వేల కుటుంబాలకు రోజు నరకమే.. తాగే నీళ్లు, పీల్చే గాలి, చుట్టూ వాతావరణం అంతా కలుషితమే. రకరకాల రోగాలతో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు బాధపడుతూ ఉంటారు. అయితే ఇదంతా గతం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత జవహర్ నగర్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడింది. 9 ఏళ్లలో అక్కడి రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. మొదట ప్రభుత్వం డంపింగ్ యార్డ్ మొత్తాన్ని క్యాపింగ్ చేసింది. అంటే మొత్తం కొండల మారిన చెత్తకుప్పను ప్లాస్టిక్ కవర్లతో కప్పేసింది. దీంతో కొంతమేరకు వాతావరణంలో కాలుష్యం తగ్గింది. ఆ తర్వాత అదే కొండపైన.. చెట్లను నాటడం మొదలుపెట్టారు. చూస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పూర్తిగా చెట్లతో ప్రకృతి ప్రసాదించిన ఓ గుట్టలా కనిపిస్తుంది.

అయితే ఇకపై గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే చెత్తను ఎక్కడ డప్పు చేయాలనేది ప్రభుత్వానికి ఓ ప్రశ్నగా మారింది. అక్కడే ఓ పవర్ ఫుల్ ఐడియా పట్టింది. రోజు వచ్చే ఆరు నుంచి ఏడు వేల మెట్రిక్ట్ టన్నుల చెత్తతో 50 మెగావాట్ల విద్యుత్ తయారు చేయొచ్చు అనేది ఆలోచన. అంతే వెంటనే టెండర్లు పిలిచి రామ్కీ అనే సంస్థకు ఈ పవర్ ప్రొడక్షన్ పనులు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

ఈ బయో నేచురల్ పవర్ గత నాలుగు సంవత్సరాలుగా ఉత్పత్తి అవుతుంది. అసలు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు చెత్తను తీసుకువెళ్ళకు ముందే హైదరాబాదులో ఆయా క్లస్టర్లలో చెత్తను వేరు చేస్తున్నారు. పొడి చెత్త తడి చెత్తను వేరుచేసి… పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి తడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారు. దీంతో జవహర్ నగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. అంతేకాదు నీటిలో కాలుష్యం తగ్గింది. గతంలో ఏ బోరుబావి నుంచైనా నల్లటి నీరే వచ్చేది. కానీ ఇప్పుడు కాస్త నీరు తెల్లబడింది. వాతావరణ కాలుష్యంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఇంకొన్ని దశాబ్దాల తర్వాత ఈ డంపింగ్ యార్డ్ పూర్తి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండల మారిపోతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..