లాయర్ టూ లీడర్.. వయా న్యూస్ కంట్రిబ్యూటర్.. రఘునందన్ ‌రావు రాజకీయ ప్రస్థానం ఇలా..

Raghunandan Rao Telangana Election 2023: న్యూస్ కంట్రిబ్యూటర్.. వకీల్ సాబ్.. రాజకీయ నేత.. ఇలా తన రాజకీయ ప్రస్థానంలో ఒక్కో మెట్టు ఎదిగారు. ఓటములు ఎదురైనా.. పోరాటం ఆపకుండా చివరికి విజయం సాధించారు ఈయన. పార్టీ క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే మంచి పేరు కూడా ఉంది. 2020లో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో..

లాయర్ టూ లీడర్.. వయా న్యూస్ కంట్రిబ్యూటర్.. రఘునందన్ ‌రావు రాజకీయ ప్రస్థానం ఇలా..
Raghunandan Rao
Follow us

|

Updated on: Dec 02, 2023 | 11:08 AM

Raghunandan Rao Telangana Election 2023: న్యూస్ కంట్రిబ్యూటర్.. వకీల్ సాబ్.. రాజకీయ నేత.. ఇలా తన రాజకీయ ప్రస్థానంలో ఒక్కో మెట్టు ఎదిగారు. ఓటములు పలకరించినా.. అలుపెరగని పోరాటంతో విజయం వైపు అడుగులు వేశారాయన. పార్టీ క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే మంచి పేరు కూడా ఉంది. 2020లో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగి అధికార పార్టీ అభ్యర్ధిపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారాయన. ఇంతకీ ఈ రాజకీయ నాయకుడు ఎవరనుకుంటున్నారా.? మరెవరో కాదు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

మార్చి 23,1968లో సిద్ధిపేటలో జన్మించిన రఘునందన్ రావు.. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్, LLB, BEd, హ్యూమన్ రైట్స్ తో పీజీ డిప్లమా పూర్తి చేశారు. డిగ్రీ పట్టా పొందిన అనంతరం 1991లో పటాన్ చెరు ప్రాంతానికి నివాసం మార్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందిన రఘునందన్ రావు.. కెరీర్ మొదట్లో ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఐదేళ్ల పాటు న్యూస్ కంట్రీబ్యూటర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా సేవలందించారు. 2013లో అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ కేసు తీసుకున్నందుకు రఘునందన్ రావు పేరు.. అప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది. వృత్తి ధర్మం వేరు.. రాజకీయం వేరు అని అప్పట్లో ఆ కేసు తీసుకున్నప్పుడు వివరణ సైతం ఇచ్చారు రఘునందన్ రావు.

రెండుసార్ల ఓటమి.. ఆ తర్వాత ఊహించని ఫలితం..

చిన్నప్పటి నుంచి రఘునందన్ రావుకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. దీంతో ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇక 2013లో టీఆర్ఎస్ పార్టీ రఘునందన్ రావును సస్పెండ్ చేయగా.. అనంతరం బీజేపీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2020 దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేసి.. అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 1,074 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక రకంగా ఈ విజయం తెలంగాణలో బీజేపీకి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. కాగా, 2018 ఎన్నికల లెక్కల ప్రకారం అప్పటిలో రఘునందన్ రావు ఆస్తుల విలువ రూ. 15.93 కోట్లు, అలాగే అప్పుల విలువ రూ. 80 లక్షలు. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో బీజేపీ తరపున దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు రఘునందన్ రావు.

ఇవి కూడా చదవండి

బీజేపీదే అధికారం.. అదే ధీమా..

పోలింగ్ డే రోజు ఓటు వేసిన అనంతరం రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్న ఆయన.. వివేకంతో ఆలోచన చేసే తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఓటేస్తారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..

Latest Articles