Telangana Elections 2023: హైదరాబాద్‌లో పోలింగ్ శాతం పెరిగేనా.. ఓటు వేయడం లో సాఫ్ట్‌వేర్‌ల ఆలోచన ఎలా ఉందంటే..!
Hyderabad: ఐటీ కోరిడార్ లో సుమారుగా 7 లక్షల మంది ఐటి ఉద్యోగులు ఉంటారు.. కానీ చాలా మందికి ఇక్కడ ఓటు హక్కు లేదు.. 30 నుండి 40 శాతం సొంత ఊర్లోనే ఓటు హక్కు ఉందని చెప్తున్నారు ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగాలలో 25శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైతే 75శాతం తెలుగు వారే ఉంటారు. అందులోనూ హైదరాబాదులో పుట్టి పెరిగిన వారు స్థిరపడిన వారు 40 శాతం ఉండగా వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టినా 10 శాతం కూడా ఓటు వేసేందుకు రారు..
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ నాయకుల చూపంత వారిపైనే ఉంది… అసలు పోలింగ్ అనగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గుర్తు వస్తారు…అయితే, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ తో పాటు అనుబంధ రంగ ఉద్యోగులు పొలింగ్ కు దూరంగా ఉంటారని అపవాదం ఉంది.. చదువుకున్న వారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆ సమయంలో సెలవులను పెట్టి టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల పోలింగ్ శాతం పెంచేందుకు గానూ.. స్వచ్ఛంద సంస్థలు, ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.. ఇందుకుగాను ఒకవైపు రాజకీయ నాయకులు సుడిగాలి పర్యటనలు చేసుకుంటూ ప్రచారాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్తున్నారు.. మరోవైపు ఓటర్లను ప్రభావితం చేసేందుకు పలు ప్రాంతాల్లో డబ్బులు, బంగారం, నిత్యం ఉపయోగపడే వస్తువులను ఓటర్లకు పంచుతున్నారు… అయితే ఇలా రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి వాటిని తీసుకొని కొంతమంది ఓటర్లు ఓట్లు వేస్తుంటే, మరి కొంతమంది నిజాయితీగా డబ్బులను తీసుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు…
కానీ, నగరంలో వాళ్లు మాత్రం పోలింగ్ వైపు చూడరు అని అపవాదం విపరీతంగా ఉంది… నగరంలో పోలింగ్ శాతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువే. ఉన్నత చదువులు చదివిన వారు సైతం పోలింగ్ రోజు ఓటు వేసేందుకు బయటికి కూడా రారు.. అలాంటి వారు ఎన్నికల సమయంలో టూర్లను ప్లాన్ చేసుకొని బయటికి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.. అందుకుగాను ఎన్నికల సంఘం స్వచ్ఛంద సంస్థలు ఐటి కారిడార్ పై ఫోకస్ పెట్టింది..
ఐటీ కారిడార్ లో సుమారుగా 7 లక్షల మంది ఐటి ఉద్యోగులు ఉంటారు.. కానీ చాలా మందికి ఇక్కడ ఓటు హక్కు లేదు.. 30 నుండి 40 శాతం మంది సొంత ఊర్లోనే ఓటు హక్కు ఉందని చెప్తున్నారు ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగాలలో 25శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైతే 75శాతం తెలుగు వారే ఉంటారు. అందులోనూ హైదరాబాదులో పుట్టి పెరిగిన వారు, స్థిరపడిన వారు 40 శాతం ఉండగా.. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా వారిలో 10 శాతం ఓటర్లు కూడా ఓటు వేసేందుకు రారు..
నగరంలో ఉత్సాహవంతులు ఓటు వేస్తేనే ఓటు శాతం పెరుగుతుంది. లేకపోతే ఎప్పటిలానే నిందలు మోయాల్సి ఉంటుంది… ఈ విధంగా ఐటీ కారిడార్స్ లో పోలింగ్ శాతం పెంచేందుకు గానూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈసీ, మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల్లో ఓటు హక్కు వినియోగంపై పలు రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..