AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాల్లో దొరికిన 400 ఏళ్ల నాటి హ్యాండ్ గ్రెనేడ్లు.. ఆయుధాలపై రాసి ఉన్న హెచ్చరిక సందేశాలు..?

మింగ్ రాజవంశం (1368-1644) కాలంలో ఇవి సైనికులకు ఆయుధాలుగా ఉండేవన్నారు. అంటే ఈ ఆయుధాల సేకరణ దాదాపు 400 సంవత్సరాల నాటిదిగా నిర్ధారించారు. ఈ సాధారణ రాళ్లకు గన్‌పౌడర్‌ని పూరించడానికి మధ్యలో గుండ్రని రంధ్రం ఉంటుంది. అందులో పేలుడు పదార్థం నింపిన తర్వాత వాటిని సీల్‌ చేస్తారు. దీంతో శత్రువుపై దాడి చేసిన వెంటనే.. భారీ పేలుడు సంభవిస్తుంది. అయితే, దాని చుట్టూ ప్రజలు నివాసం ఏర్పరచుకున్నప్పటికీ ఎవరికీ దాని గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవటం ఇక్కడ గమనార్హం.

తవ్వకాల్లో దొరికిన 400 ఏళ్ల నాటి హ్యాండ్ గ్రెనేడ్లు.. ఆయుధాలపై రాసి ఉన్న హెచ్చరిక సందేశాలు..?
Stone Grenades
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2023 | 2:57 PM

Share

పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలలో ప్రతిరోజూ అనేక విషయాలను కనుగొంటారు. ఇది చరిత్రలోని అనేక అంశాలను వెల్లడిస్తుంది. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సమీపంలో ఒక ఆవిష్కరణ చేశారు. మింగ్ రాజవంశం నాటి 400 సంవత్సరాల నాటి రాతి బాంబులను వెలికితీశారు. ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సరిహద్దులో గల ఆయుధాల కర్మగారంగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని చుట్టూ ప్రజలు నివాసం ఏర్పరచుకున్నప్పటికీ ఎవరికీ దాని గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవటం ఇక్కడ గమనార్హం.

చైనాలోని గ్రేట్ వాల్ బడాలింగ్ విభాగంలోని పశ్చిమ ప్రాంతంలో 59 రాతి బాంబుల బండాగారం బయటపడింది. ఇది బీజింగ్ నగరానికి వాయువ్యంగా 80 కి.మీ దూరంలో ఉంది. ఒక ఇంటర్వ్యూలో బీజింగ్ ఆర్కియాలజికల్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు షాంగ్ హెంగ్ మాట్లాడుతూ.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెంబడి ఇలాంటివి కనుగొనడం ఇదే మొదటిసారి అని చెప్పారు. మింగ్ రాజవంశం (1368-1644) కాలంలో ఇవి సైనికులకు ఆయుధాలుగా ఉండేవన్నారు. అంటే ఈ ఆయుధాల సేకరణ దాదాపు 400 సంవత్సరాల నాటిదిగా నిర్ధారించారు. ఈ సాధారణ రాళ్లకు గన్‌పౌడర్‌ని పూరించడానికి మధ్యలో గుండ్రని రంధ్రం ఉంటుంది. అందులో పేలుడు పదార్థం నింపిన తర్వాత వాటిని సీల్‌ చేస్తారు. దీంతో శత్రువుపై దాడి చేసిన వెంటనే.. భారీ పేలుడు సంభవిస్తుంది.

ఈ హ్యాండ్ గ్రెనేడ్లపై కొన్ని సందేశాలు కూడా రాశారు. ఇది శత్రువుల పట్ల జాగ్రత్త వహించమని సెక్యూరిటీకి హెచ్చరిక సందేశం. చైనా సైనిక చరిత్రలో నిపుణుడైన పురావస్తు శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ శత్రు దాడుల నుండి గోడను రక్షించడానికి గ్రెనేడ్లు అవసరమని చెప్పారు. మధ్య తరహా బోలు రాతి ముక్కల లోపల ఉన్న రంధ్రాలలో గ్రెనేడ్‌లను నిల్వ చేసి ఉంచారని, దాడుల సమయంలో అది మారిందని చెప్పారు. వాటిని కనుగొని శత్రువులపైకి విసిరేయడం సులభమన్నారు.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా, సైనికులు సులభంగా గోడ పైకి ఎక్కడానికి, పై నుండి బాణాలు వేయడానికి రూపొందించిన పురాతన గోడలను కూడా వారు కనుగొన్నారు.వాటిపై ఉన్న అనేక కళాఖండాలు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఆ చుట్టుపక్కల నివసించిన ప్రజల రోజువారీ జీవితాన్ని, సంస్కృతిని తెలియజేస్తాయి. అగ్నిగుండం, పొయ్యి, పాత్రలు, ప్లేట్లు, కత్తెరలు, గడ్డపారలు వంటి వాటిని అనేకం కనుగొన్నారు. గ్రేట్ వాల్ నిర్మాణపరంగా అత్యంత కష్టతరమైన విభాగం అయిన బాదలింగ్ విభాగం 2000, 2022 మధ్య 110 సార్లు తవ్వకాలు జరిపారు. 2021లో ఒక ప్రాజెక్ట్‌తో సహా గోడ నిర్మాణం గురించి ఇంకా చాలా ముఖ్యమైన ఆధారాలను అందించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..