వామ్మో.. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వింత జంతువు..! ఇది ఎలుకా.. లేక జింకా..? వీడియో చూసి చెప్పండి మీరే..

ఈ వింత జీవులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన తర్వాత అది ఏ జీవి అని కూడా తెలియక సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు..ఆ వింత జంతువు చర్యలను చూసిన నెటిజన్లు అది ఎలుకా లేక జింక అనే సందేహంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఏ జంతువు అని రకరకాల అంచనాలు వేస్తున్నారు. ఒక్కోసారి దాని ప్రవర్తన ఎలుకల లాగా, కొన్నిసార్లు జింకలా కనిపిస్తుంది. సోషల్ మీడియా యూజర్లు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నించినా ఆ జీవిని గుర్తించలేకపోయారు.

వామ్మో..  నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వింత జంతువు..! ఇది ఎలుకా.. లేక జింకా..? వీడియో చూసి చెప్పండి మీరే..
Chevrotain
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 31, 2023 | 3:16 PM

ఈ భూమిపై చాలా జంతువులు ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు మనతో కలిపేసుకుంటూ వెళ్తుంటాం.. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో వింత వింత జీవులు కూడా ఎంతో విచిత్రంగా కనిపిస్తాయి.ఈ జీవులు కొన్నిసార్లు మిమ్మల్ని టెంప్ట్ చేస్తాయి. కొన్నిసార్లు మిమ్మల్ని భయపెడతాయి. ఈ వింత జీవులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన తర్వాత అది ఏ జీవి అని కూడా తెలియక సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు..ఆ వింత జంతువు చర్యలను చూసిన నెటిజన్లు అది ఎలుకా లేక జింక అనే సందేహంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఏ జంతువు అని రకరకాల అంచనాలు వేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే ఈ జంతువు వింతగా కనిపిస్తోంది. ఒక్కోసారి దాని ప్రవర్తన ఎలుకల లాగా, కొన్నిసార్లు జింకలా కనిపిస్తుంది. సోషల్ మీడియా యూజర్లు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నించినా ఆ జీవిని గుర్తించలేకపోయారు. మీరు వీడియోలో ఆ జంతువును చూస్తే, దాని రూపాన్ని జింక లాగా ఉందంటారు. కానీ, దాని శరీరం ఎలుకల లాగా చాలా చిన్నగా ఉంది…ఈ వీడియో ‘X’ (ట్విట్టర్)లో ‘నేచర్ ఈజ్ అమేజింగ్’ ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది.ఈ పోస్ట్ శీర్షిక ఇలా ఉంది..ఇది ఎలుక-జింక అంటే mouse deer అని వ్యాఖ్యానించారు. ఇవి ప్రపంచంలోనే అతి చిన్న జంతువులుగా అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 7.1 మిలియన్ వ్యూస్, 77 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియోను చూస్తున్న సోషల్ మీడియా యూజర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా అన్నారు..ఈ వీడియో చూడటానికి చాలా అందంగా ఉంది. ఇందులోని జంతువు కూడా చాలా అందంగా కనిపిస్తుందన్నారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు.. అవి నిజంగా చిన్నవి. కానీ అది జింకా లేదంటే ఎలుకా అని నిజంగా చెప్పలేమంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..