AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సరస్సు నుండి వెలువడుతున్న నీలిరంగు మంటలు.. ఆ భయానక దృశ్యం వీడియోలు వైరల్‌

ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే దాదాపు 1.5 లక్షల మంది చూడగా, వేల మంది లైక్ చేశారు. అంతే కాకుండా వేలాది నెటిజన్లు దీనిపై కామెంట్స్ కూడా చేశారు. ఈ సరస్సు దగ్గరకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరమని చాలా మంది ప్రజలు చాలా రకాల సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి రక్షణ కవచాలు, ఏర్పాట్లు లేకుండా ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టం అంటున్నారు. మరొక వినియోగదారు దీనిని చాలా ఉత్తేజకరమైనదిగా అభివర్ణించారు.

Watch Video:  సరస్సు నుండి వెలువడుతున్న నీలిరంగు మంటలు.. ఆ భయానక దృశ్యం వీడియోలు వైరల్‌
Volcanic Lake
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2023 | 5:05 PM

Share

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక సరస్సు లోపల నుండి నీలిరంగు మంటలు ఉబికి వస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ వీడియోగదారులు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి భయానక సరస్సు గురించిన సమాచారం అడుగుతున్నారు. ఈ ప్రత్యేకమైన సరస్సు ఎక్కడ ఉందో మీకు తెలుసుకోవాలనుంది కదా..! ఈ సరస్సు ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఉంది. దీని పేరు కవా ఇజెన్ సరస్సు. ఇది యాసిడ్‌తో నిండిన అగ్నిపర్వత బిలం. ఈ యాసిడ్ కారణంగానే దాని నుండి నీలి రంగు మంటలు అడపాదడపా బయటకు వస్తాయి. అయితే, ఈ సరస్సు దగ్గరకు వెళ్లేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నీలి కిరణం ఎందుకు వస్తుంది..?

ఇవి కూడా చదవండి

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ వీడియోతో పాటు క్యాప్షన్‌లో దీని గురించి సమాచారాన్ని ఇచ్చింది. దీని ప్రకారం, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు దీనిని భూమిపై అతిపెద్ద యాసిడ్ బారెల్‌గా పిలుస్తున్నారు. సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు వివిధ ఖనిజాల అధిక సాంద్రత కారణంగా ఇది ఆశ్చర్యకరమైన నీలం-ఆకుపచ్చ రంగును కలిగి ఉంది. ఈ సరస్సు అత్యంత అద్భుతమైన దృగ్విషయాలలో ఒకటి దాని ప్రత్యేక నీలి రంగు మంటలు అని వివరించారు. ఈ భయంకరమైన నీలి జ్వాలలు అగ్నిపర్వత బిలంలోని పగుళ్ల నుండి వెలువడుతున్న సల్ఫ్యూరిక్ వాయువుల ద్వారా మండుతాయి. దీనివల్ల రాత్రిపూట ఇక్కడ చూసేందుకు ఎంతో ఉత్కంఠభరితమైన దృశ్యం కనిపిస్తుంది.

ఇకపోతే, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. ఈ వీడియోలో ఒక మహిళ కవా ఇజెన్ సరస్సు గురించి సవివరమైన సమాచారం ఇచ్చారు. ఇందులో సరస్సు ఉపరితలంపై నీలం రంగు మంటలు కూడా కనిపిస్తాయి. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే దాదాపు 1.5 లక్షల మంది చూడగా, వేల మంది లైక్ చేశారు. అంతే కాకుండా వేలాది నెటిజన్లు దీనిపై కామెంట్స్ కూడా చేశారు. ఈ సరస్సు దగ్గరకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరమని చాలా మంది ప్రజలు చాలా రకాల సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి రక్షణ కవచాలు, ఏర్పాట్లు లేకుండా ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టం అంటున్నారు. మరొక వినియోగదారు దీనిని చాలా ఉత్తేజకరమైనదిగా అభివర్ణించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..