ఇతడు చొక్కా వేసుకోడు.. చెప్పులు తొడుక్కోరు.. 60 ఏళ్లుగా ఇదే పరిస్థితి..!
ఇతడు చిన్నతనం నుంచి చొక్కా వేసుకోలేదు. వేసుకోమని చెప్పినా.. వేసుకోవడానికి ఇష్ట పడలేదు. ఈ క్రమంలో 60 ఏళ్లుగా చొక్కా లేకుండా జనంలో తిరుగుతున్నాడు. చొక్కా వేసుకోడు. గతం లో కుటుంబ సభ్యులు చొక్కా వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ.. ఈయన ససెమిరా అన్నారు. చొక్కా లేకుండానే వ్యవసాయం చేస్తున్నాడు.. ఇతనిని అందరూ అభినవ గాంధీ అని పిలిస్తున్నారు.

ఇతడు చిన్నతనం నుంచి చొక్కా వేసుకోలేదు. వేసుకోమని చెప్పినా.. వేసుకోవడానికి ఇష్ట పడలేదు. ఈ క్రమంలో 60 ఏళ్లుగా చొక్కా లేకుండా జనంలో తిరుగుతున్నాడు. చొక్కా లేకుండానే వ్యవసాయం చేస్తున్నాడు.. ఇతనిని అందరూ అభినవ గాంధీ అని పిలిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపుర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కన్నను పల్లె గాంధీగా పిలుస్తుంటారు. బక్కన్న చిన్నతనం నుంచి చొక్కా వేసుకోడు. ఎందుకో తెలియదు గానీ.. చొక్కా వేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. అవస్థలు వెళ్లదీసినా.. చొక్కా వేసుకోడు. ఎంత ఎండ ఉన్నా.. చొక్కా వేసుకోడు. గతం లో కుటుంబ సభ్యులు చొక్కా వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ.. ఈయన ససెమిరా అన్నారు.
అంతే కాదు గతంలో ఇతడు.. గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా కూడా పని చేశారు. ఆ సమయంలో కూడా చొక్కా లేకుండానే గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరయ్యాడు. 20 ఏళ్ల క్రితం ఇతడిని చూసిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అయిలాపుర్ గాంధీగా పేరు పెట్టారు. అప్పటి నుంచి అతడిని ఎక్కడికి వెళ్లినా అయిలాపుర్ గాంధీగానే పిలుస్తుంటారు. అతడి వయస్సు ప్రస్తుతం 70 ఏళ్లు ఉంటుంది. అతడు కాళ్ళకు చెప్పులు వేసుకోడు. ఎటు వెళ్లిన చెప్పులు లేకుండానే వెళ్తున్నాడు. అంతే కాదు.. ప్రకృతిని అమితంగా ప్రేమిస్తాడు. బక్కన్న చూసి అందరూ గాంధీగా పలకరిస్తుంటారు. సామాన్యంగా ఉండేందుకు..ఇష్టపడుతాడు..ఈ బక్కన్న అందరి తో కలిసి మెలిసి ఉంటారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




