Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వచ్చే 3 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్తచెప్పింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్తచెప్పింది వాతావరణ శాఖ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో పాటు.. భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు అక్టోబర్ 21, 2025న , 0830 గంటల సమయానికి అదే ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారింది.. సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, బుధవారం 22 అక్టోబర్ 2025 మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు- దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి – దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు..
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీవర్ష సూచన చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ప్రజల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్ల కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటనలో తెలిపారు.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ – కోస్తా ఆంధ్రప్రదేశ్:-
మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – ఈదురు గాలులు గంటకు 35 -45 కి. మీ గరిష్టముగా 55 కి. మీ వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – ఈదురు గాలులు గంటకు 30-40 కి. మీ గరిష్టముగా 50 కి. మీ వేగముతో వీచే అవకాశముంది.
బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 35 -45 కి. మీ గరిష్టముగా 55 కి. మీ వేగముతో వీచే అవకాశముంది.
తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు:
మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మీ ప్రాంతాలు, నగరాల్లో వాతావరణ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




