Nizamabad Constable Murder Case: అర్ధరాత్రి రియాజ్ మృత దేహానికి పోస్టుమార్టం.. తెల్లారేసరికి అంత్యక్రియలు పూర్తి!
Nizamabad hospital encounter: సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ సోమవారం (అక్టోబర్ 20) జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అతడి అంత్యక్రియలు ఈ రోజు తెలవరాక ముందే పూర్తయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జిజిహెచ్ ఆసుపత్రి మార్చురీలో రియాజ్ మృత దేహానికి

నిజామాబాద్, అక్టోబర్ 21: నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ సోమవారం (అక్టోబర్ 20) జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అతడి అంత్యక్రియలు ఈ రోజు తెలవరాక ముందే పూర్తయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జిజిహెచ్ ఆసుపత్రి మార్చురీలో రియాజ్ మృత దేహానికి పోస్టుమార్టం జరిగింది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహం ఆసుపత్రి నుండి తరలించారు. అనంతరం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున రియాజ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా బైకులు,బుల్లెట్ వాహనాలను దొంగిలించడంలో రియాజ్ సిద్ధహస్తుడు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసులు. గత మూడేళ్లలో దాదాపు 40 కేసులు నమోదైనాయి. దొంగిలించిన వాహనాలకు ఇంజిన్ నంబర్లు మార్చి, మహారాష్ట్రలో వాహనాలు అమ్మి సొమ్ము చేసుకునే వాడు. మూడుసార్లు జైలుకు వెళ్లి బెయిలుపై తిరిగొచ్చిన రియాజ్ రియాజ్ నేర చరిత్రను కొనసాగించాడు. ఈ క్రమంలో ఓ దొంగతనం కేసులో రియాజ్‌ను అక్టోబర్ 17న పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. స్టేషన్‌కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి మరణించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర పోలీస్ విభాగం పరారీలో ఉన్న నిందితుడిని 2 రోజుల్లోనే జల్లెడ పట్టి పట్టుకున్నారు. అయితే అరెస్టు సమయంలో రియాజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అతడిని జీజీహెచ్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్ ప్రయత్నించారు. పోలీసు సిబ్బందిపై దాడి చేసి వారి వద్ద ఆయుధాలు లాక్కునేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పులు జరపగా.. రియాజ్ బుల్లెట్ గాయాలకు మృతి చెందాడు.
అనంతరం జీజీహెచ్ దవాఖాన మార్చురీలో సోమవారం అర్ధరాత్రి రియాజ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు బోధన్ రోడ్డులోని స్మశాన వాటికలో తెల్లవారక ముందే మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








