Pig butchering: భయపెడతోన్న ‘పిగ్ బుచరింగ్‌’ మోసాలు.. ఇంతకీ ఇదేంటి, టెక్‌ నిపుణులు ఏమంటున్నారు.?

ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం.. ఇలాంటివి ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి. ఇందుకోసం వెనకాముందు చూడకుండా మోసపోతుంటారు. ప్రజల ఈ ఆశనే తమకు పెట్టుబడిగా మార్చుకొని మోసాలకు దిగుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ తరహా మోసాలనే పిగ్‌ బుచరింగ్‌గా పిలుస్తున్నారు. భారత్‌లో ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి మోసాల బారిన పడివారు ...

Pig butchering: భయపెడతోన్న 'పిగ్ బుచరింగ్‌' మోసాలు.. ఇంతకీ ఇదేంటి, టెక్‌ నిపుణులు ఏమంటున్నారు.?
Pig Butchering Scam
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 20, 2023 | 9:01 AM

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీతో ఎన్ని రకాల లాభాలు కలుగుతున్నాయో అదే విధంగా నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఏదో ఒక రూపంలో మోసం చేస్తూ ప్రజలను నిండా ముంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘పిగ్ బుచరింగ్‌’ అనే మోసాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఏంటీ ‘పిగ్ బుచరింగ్‌’ మోసం.? దీని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది.? దీనిబారిన పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం.. ఇలాంటివి ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి. ఇందుకోసం వెనకాముందు చూడకుండా మోసపోతుంటారు. ప్రజల ఈ ఆశనే తమకు పెట్టుబడిగా మార్చుకొని మోసాలకు దిగుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ తరహా మోసాలనే పిగ్‌ బుచరింగ్‌గా పిలుస్తున్నారు. భారత్‌లో ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి మోసాల బారిన పడివారు  రూ. కోట్లలో కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మోసం బారినపడకూడదంటే.. ఏం చేయాలనే దానిపై జిరోదా ఫౌండర్, సీఈఓ నితిన్‌ కామత్‌ కొన్ని సూచనలు చేశారు.

ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఫేక్‌ జాబ్‌ ఆఫర్లు, అధిక మొత్తంలో ప్రతిఫలం, క్రిప్టోలో పెట్టుబడుల రూపంలో ఈ మోసాలు జరుగుతున్నట్లు నితిన్‌ కామత్‌ తెలిపారు. ఇందుకోసం కేటుగాళ్లు ప్రేమ, స్నేహం పేరుతో నటిస్తూ అవతలి వ్యక్తులను మోసం చేస్తున్నారు. ఫేక్‌ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేస్తూ వలలో వేసుకుంటున్నారు. అనంతరం ఉద్యోగాలు, అధిక లాభాలను ఆశజూపి మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇక ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే.. సోషల్‌ మీడియా వేదికగా తెలియని వ్యక్తలు నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయమని, లింక్‌ను ఓపెన్‌ చేయమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. అవతలి వ్యక్తులు ఏదైన మోసం చేస్తున్నారని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులను సంప్రదించాలి. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌ వివరాలు, పాన్‌ కార్డ్ వివరాలను ఎవ్వరితోనూ షేర్‌ చేసుకోవద్దు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..