AI: ఆత్మహత్య ఆలోచనలు గుర్తించే టెక్నాలజీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతం..
ప్రస్తుతం ప్రతీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారింది. ఇక కృత్రిమ మేథ చివరికి మనుషుల భావోద్వేగాలను కూడా అంచనా వేసే స్థాయికి ఎదిగింది. ఎంతలా అంటే ఎవరికైనా ఆత్మహత్య చేసుకునే ఆలోచన వస్తే ముందుగానే ఏఐ టెక్నాలజీ గుర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో వస్తున్న మార్పులు గమనిస్తే ఇది అక్షర సత్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అసాధ్యం అనుకున్న ఎన్నో పనులు సుసాధ్యం అయ్యాయి.
ప్రస్తుతం ప్రతీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారింది. ఇక కృత్రిమ మేథ చివరికి మనుషుల భావోద్వేగాలను కూడా అంచనా వేసే స్థాయికి ఎదిగింది. ఎంతలా అంటే ఎవరికైనా ఆత్మహత్య చేసుకునే ఆలోచన వస్తే ముందుగానే ఏఐ టెక్నాలజీ గుర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో పరిశోధకులు ఈ దిశగా అడుగులు వేశారు. 59 తక్కువ ఆదాయంగల దేశాల్లో ప్రతీ 6గురు యువకుల్లో ఒకరు ఏదో సమయంలో ఆత్మహత్యాయత్యం చేసినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్లో డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలను ముందుగానే పసిగట్టడంలో ఉపయోగపడుతుందని సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కౌమారదశలో ఉన్నప్పుడు కలిగే ఆత్మహత్య, తమను తాము బాధించుకునే ఆలోచనలను ఏఐ ఎలా అంచనా వేస్తుందన్న దాని గురించి పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా న్యూ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించారు.
పరిశోధనలో భాగంగా మొత్తం 2,800 మంది కౌమారదశలో ఉన్నవారి మానసిక స్థితి, వారి ఆలోచనల విధానం, డిప్రెషన్ వంటి హెల్త్ ప్రొఫైల్స్ డేటాను సేకరించారు. వీరిలో.. 15 నుంచి 16 ఏళ్ల వారికి ఒక గ్రూప్‌గా, 17 నుంచి 21 ఏండ్ల లోపు వారిని మరో గ్రూప్‌గా విభజించారు. అనంతరం వారి కేర్ టేకర్స్, స్కూల్ టీచర్స్‌ల ద్వారా వారి మానసిక ధోరణలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని మొత్తం డేటాను అనలైజ్ చేశారు. ఇక న్యూ ఏఐ ర్యాండమ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించి, సదరు డేటా ఆధారంగా వారిలో కలిగిన ఆత్మహత్య ఆలోచనలను విశ్లేషించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించిన వివరాల ప్రకారం.. 10.5 శాతం మంది తమని తాము బాధించుకున్నారని, అలాగే 5.3 శాతం మంది గడిచిన 14 నెలల కాలంలో కనీసం ఒక్కసారైనా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని తేలింది. దీంతో ఈ కొత్త రకం ఏఐ ఆల్గరిథమ్ ఆధారంగా ఆత్యహత్య ఆలోచనలను ముందుగానే కచ్చితంగా పసిగట్టవచ్చని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు. అయితే దీనిపై ఇంకా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




