- Telugu News Photo Gallery Technology photos Redmi note 13 5g series launched in india, Check here for features and price details
Note 13 5G: భారత మార్కెట్లోకి రెడ్‌మీ కొత్త ఫోన్.. 200 ఎంపీ కెమెరాతో పాటు..
టెక్ యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రెడ్‌మీ కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. రెడ్‌మీ నోట్ 13 సిరీస్ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేశారు. గురువారం భారత మార్కెట్లోకి లాంచ్ చేయగా, జనవరి 10వ తేదీ నుంచి సేల్స్ ప్రాంభంకానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 13 5జీ, నోట్ 13 ప్రో 5జీ, నోట్ 13 ప్రో+ 5జీ ఉన్నాయి. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..
Updated on: Jan 06, 2024 | 8:16 AM

రెడ్‌మీ నోట్ 13 సిరీస్ ఫోన్‌లను గురువారం భారత మార్కెట్లోకి లాంచ్ కాంగా జనవరి 10వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్‌మీ నోట్ 13 5జీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999కాగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 108 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ మోడల్ విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999కాగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. మిడ్‌నైట్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఇక ఈ సిరీస్‌లో టాప్ ఎండ్ మోడల్ అయిన నోట్ ప్రో+ ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 31,999కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ర. 33,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 35,999గా ఉంది. ఈ ఫోన్ ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ కలర్స్‌లలో అందుబాటులో ఉండనుంది.

ఈ రెండు మోడల్స్‌లోనూ 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ కర్డ్వ్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. వీటిలో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.





























