Gmail: పొరపాటున మెయిల్‌ను వేరే వారికి పంపించారా.? ఇలా డిలీట్ చేసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది జీమెయిల్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లను కలిగి ఉంది. ఇదిలా ఉంటే మెయిల్ చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో పొరపాటున వేరే వారికి పంపిస్తుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Updated on: Feb 01, 2024 | 7:05 PM

జీమెయిల్‌ను పంపించే సమయంలో కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతుండడం సర్వసాధారణమైన విషయం. అయితే మనం పంపాలనుకున్న మెసేజ్‌లో ఏవైనా తప్పులు ఉంటే మరోసారి సరి చేసి ఇంకో మెయిల్ పంపిస్తే ఎదుటి వ్యక్తి కనీసం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

అలా కాకుండా మనం పంపాలనుకున్న వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి పంపిస్తే అది సమస్యగానే భావించాలి. అయితే వాట్సాప్ లాంటి టెక్ట్స్ మెసేజ్ యాప్స్‌లో అయితే ఎంచక్కా డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి జీమెయిల్‌లో ఎలా ఆలోచన సహజంగానే వస్తుంది కదూ!

అయితే జీ మెయిల్‌లో కూడా ఇలాంటి ఓ ఫీచర్ అందుబాటులో ఉంది. పొరపాటు వేరే వారికి పంపిన మెయిల్‌ను అన్‌డూ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం 30 సెకండ్ల లోపు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏదైనా మెయిల్ పంపిన తర్వాత.. స్క్రీన్ లెఫ్ట్ సైడ్ కిందివైపున్న బ్లాక్ బాక్స్‌లో అన్‌డు లింక్ ఉంటుంది. దీనిని సమయం ముగిసే లోపు క్లిక్ చేస్తే మెయిల్ సెండ్ అవ్వదు.

ఇంతకీ జీ మెయిల్‌లో అన్‌డూ ఎలా సెలక్ట్ చేసుకోవాలంటే. ఈ ఫీచర్ సహాయంతో మెయిల్‌ను రీకాల్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో జీమెయిల్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'జనరల్' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

ఇందులో 'అన్‌డు సెండ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో అన్‌డూ సమయాన్ని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. 5,10,20,30 సెకండ్లలో మెయిల్‌ను అన్‌డూ చేసుకునేలో సెట్టింగ్ మార్చుకోవచ్చు.





























