- Telugu News Photo Gallery Technology photos Noise launches new earbuds Noise Buds Combat Z price and features
Noise Buds: ఊహకందని బ్యాటరీతో నాయిస్ కొత్త ఇయర్ బడ్స్.. ధరెంతో తెలుసా.?
మార్కెట్లో ఇయర్ బడ్స్ హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఇయర్ బడ్స్‌ను కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఇయర్ బడ్స్‌ను తీసుకొస్తున్న ప్రముఖ వేరెబుల్స్ తయారీ సంస్థ నాయిస్ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. నాయిస్ బడ్స్ కంబాట్ ఎక్స్ పేరుతో ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చారు...
Updated on: Jan 07, 2024 | 8:57 AM

భారత్‌కు చెందిన ప్రముఖ వేరెబుల్స్ తయారీ సంస్థ నాయిస్ తాజాగా మార్కెట్లోకి కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. నాయిస్ బడ్స్ కంబాట్ ఎక్స్ పేరుతో ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చాయి. ఇంతకీ ఈ ఇబయర్ బడ్స్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.

నాయిస్ బడ్స్ కంబాట్ ఎక్స్ ఇయర్ బడ్స్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్‌ను షాడో గ్రే, థండర్ బ్లూ, కోవర్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ధర విషయానికొస్తే వీటిని రూ. 3,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 2499కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్యాటరీకి పెద్ద పీట వేశారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేసే ఏకంగా 60 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.

అలాగే ఈ ఇయర్ బడ్స్‌ను కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు సుమారు గంటన్నర పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ వినొచ్చు. ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తాయి.

ఇందులో 10ఎమ్‌ఎమ్ డైనమిక్ డ్రైవర్‌ను అందించారు. అలాగే గేమింగ్‌కు మంచి అనుభూతి ఇచ్చేలా 40ఎమ్‌ఎస్ లాటెన్సీ గేమింగ్ మోడ్‌ను ఇచ్చారు. వాటర్ రెస్టెన్స్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్‌ను ఇచ్చారు. అలాగే క్వాడ్ మైక్రోఫోన్ సెటప్ ఈ ఇయర్ బడ్స్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.




