- Telugu News Photo Gallery Technology photos Find your things with this small gadgets Apple air tag, Check here for price and features
Apple Airtag: బైక్ కీ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారా.? ఈ గ్యాడ్జెట్ మీ కోసమే..
బైక్ కీ ఎక్కడో పెట్టేస్తాం తీరా సమయానికి దొరక్కా ఇబ్బంది పడుతుంటాం. మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే ఓ గ్యాడ్జెట్ అందుబాటులో ఉందని మీకు తెలుసా.? అదే యాపిల్ ఎయిర్ ట్యాగ్. ఈ ట్రాకింగ్ గ్యాడ్జెట్‌తో బైక్ కీ మొదలు, పర్స్ వరకు ఎక్కడ పెట్టి మర్చిపోయినా వెంటనే తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ గ్యాడ్జెట్ ఎలా పనిచేస్తుందంటే..
Updated on: Jan 07, 2024 | 10:38 AM

యాపిల్ కంపెనీ ఎయిర్‌ట్యాగ్ పేరుతో ఓ చిన్న ట్రాకింగ్ గ్యాడ్జెట్‌ను లాంచ్ చేసింది. చూడ్డానికి చాలా చిన్నగా ఉండే ఈ గ్యాడ్జెట్ పనితీరు మాత్రం సూపర్ అని చెప్పాలి. బైక్ కీ మొదలు, పర్స్‌ల వరకు ఈ ట్యాగ్‌ను అటాచ్ చేస్తే చాలు ఎక్కడున్నా వెంటనే జాడ పసిగట్టొచ్చు.

ఈ యాపిల్ ఎయిర్ ట్యాగ్ ధర భారత్‌లో రూ. 3,499గా ఉంది. యాపిల్ ఎయిర్ ట్యాగ్‌ను బ్యాగ్‌లకు, తాళం చెవిలకు అటాచ్ చేయాలి. ఈ గ్యాడ్జెట్ ప్రిసిషన్ ఫైండింగ్ ద్వారా పని చేస్తాయి.

ఈ గ్యాడ్జెట్‌లో లిథియం 3వీ కాయిన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీలు సుమారు ఏడాది పాటు నిర్వీరమంగా పనిచేస్తాయి. బ్యాటరీ ధర కూడా పెద్దగా ఏమి ఉండదు.

ఫైండ్ మై నెట్‌వర్క్ ఆధారంగా ఈ ట్యాగ్ ఎక్కడుందో గుర్తించవచ్చు. ఇది పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్, గోప్యమైన నెట్‌వర్క్. మీరు దేని కోసం వెతుకుతున్నారో దాని చుట్టుపక్కల ఉన్న డివైస్‌ల లొకేషన్‌ను మీ ఐక్లౌడ్‌కు పంపిస్తాయి, మీ డివైస్‌కు మెసేజ్ కూడా వస్తుంది.

ప్రిసిషన్ ఫైండింగ్ అనేది ఒక సెక్యూర్ ఫీచర్. ఐఫోన్ 11 ఆపైన మొబైల్స్‌కు ఇది పని చేస్తుంది. ఇక ఎయిర్ ట్యాగ్‌ను వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా డిజైన్ చేశారు. ఐపీ67 రేటింగ్‌తో దీనిని రూపొందించారు.




