Rohit Sharma: కెప్టెన్సీ వివాదంపై ‘హిట్‌మ్యాన్’ తొలి రియాక్షన్ ఇదే.. సెల్యూట్ చేయాల్సిందే భయ్యా..
Rohit Sharma's 1st Reaction On Australia ODI Series: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్-కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ (BCCI) స్క్వాడ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సీనియర్ ఆటగాళ్లుగా జట్టులో కొనసాగనున్నారు.

Rohit Sharma’s 1st Reaction On Australia ODI Series: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీని తప్పించి, యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌పై హిట్‌మ్యాన్ మొట్టమొదటిసారి స్పందించాడు. బీసీసీఐ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో, అభిమానులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, రోహిత్ శర్మ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బయటపెట్టారు.
కెప్టెన్సీపై స్పందించకుండా..
కెప్టెన్సీ మార్పుపై నేరుగా స్పందించడానికి రోహిత్ శర్మ నిరాకరించాడు. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ గురించి మాత్రం తన ఉత్సాహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇటీవల ముంబైలో జరిగిన ‘CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడారు.
రోహిత్ శర్మ తొలి స్పందన ఇదే..
“ఆస్ట్రేలియాకు వెళ్లడం, ఆ జట్టుకు వ్యతిరేకంగా ఆడటం నాకు చాలా ఇష్టం. ఆస్ట్రేలియా ప్రజలు క్రికెట్‌ను అమితంగా ప్రేమిస్తారు,” అని రోహిత్ శర్మ అన్నాడు.
కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత కూడా ఆయన దృష్టి కేవలం ఆటపైనే ఉందని, ఆస్ట్రేలియా గడ్డపై క్రికెట్ ఆడటం తనకు ఎంతగానో నచ్చుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశాడు.
భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే కెప్టెన్సీ మార్పు..
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్-కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ (BCCI) స్క్వాడ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సీనియర్ ఆటగాళ్లుగా జట్టులో కొనసాగనున్నారు.
ఈ కెప్టెన్సీ మార్పుపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే మూడు ఫార్మాట్‌లకు (టెస్టు, వన్డే, టీ20) ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం ఆచరణ సాధ్యం కాదన్న కారణాలను ఆయన వివరించారు.
అగార్కర్ వ్యాఖ్యలు..
“మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం ఆచరణ సాధ్యం కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించాలి, తదుపరి ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలుపెట్టాలి. కొత్త కెప్టెన్‌కు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రోహిత్‌తో మాట్లాడి ఈ విషయం కమ్యూనికేట్ చేశాం” అని అగార్కర్ తెలిపారు. అయితే, రోహిత్ శర్మ స్పందన గురించి మాత్రం అగార్కర్ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.
రోహిత్ శర్మ నుంచి కొత్త శకానికి సంకేతం..
రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వెంటనే, ఆయన సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. తన జెర్సీ నంబర్ 45ను, కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జెర్సీ నంబర్ 77ను ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేశారు.
“ఒక శకం (45) ముగింపు.. కొత్త శకం (77) ప్రారంభం,” అని ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది తన కెప్టెన్సీ శకం ముగిసిందని, యువ ఆటగాడి శకం మొదలైందని స్ఫూర్తిదాయకంగా అంగీకరించినట్లు అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఇది దాదాపు 12 ఏళ్ల క్రితం చేయడం గమనార్హం.
మొత్తానికి, కెప్టెన్సీ మార్పుపై ఎటువంటి అసంతృప్తిని చూపకుండా, రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌పై పూర్తి దృష్టి పెట్టిన రోహిత్ శర్మ, జట్టులో ఒక సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా తన పాత్రను విజయవంతంగా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








