AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యువు ముందు ఓడిన ప్రేమ జంట.. అయోమయంలో మూడు నెలల పాప..!

ప్రేమ జంటను మృత్యువు కదిలించింది.. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యును జయించలేకపోయింది.. మృత్యువు ముందు ప్రేమ ఓడిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం ప్రేమ వివాహంతో ఒక్కటైన జంటకు మూడు నెలల పాప పుట్టింది. కుటుంబ సభ్యులు అక్కున చేర్చుకున్న రోజునే భార్యాభర్తలు అనంత లోకాలకు వెళ్లిపోయారు.

మృత్యువు ముందు ఓడిన ప్రేమ జంట.. అయోమయంలో మూడు నెలల పాప..!
Road Accident
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Dec 05, 2025 | 9:29 AM

Share

ప్రేమ జంటను మృత్యువు కదిలించింది.. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యును జయించలేకపోయింది.. మృత్యువు ముందు ప్రేమ ఓడిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం ప్రేమ వివాహంతో ఒక్కటైన జంటకు మూడు నెలల పాప పుట్టింది. కుటుంబ సభ్యులు అక్కున చేర్చుకున్న రోజునే భార్యాభర్తలు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంతోషంగా గడిపిన గంట క్షణాల్లో భోజనం చేసి ఆధార్ కార్డులు అప్డేట్ కోసం రాజానగరంలోని బ్యాంకుకు బయలుదేరిన భార్యాభర్తలకు సిమెంట్ లారీ రూపంలో మృత్యు ఒడిలో పొట్టన పెట్టుకుంది.. ప్రమాద సమయంలో లారీ రెండు స్కూటీలను ఢీకొంటూ వెళ్లింది. నుజ్జునుజైన స్కూటీపై వెళుతున్న ఇద్దరు స్వల్పగాయలతో బయటపడగా.. కనీసం స్కూటీపై గీత కూడా తగలని బండిపైన ఉన్న భార్యాభర్తలు చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైఎస్సార్ జంక్షన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో స్కూటీ పై వెళుతున్న భార్య భర్తలు జుత్తుక లీలా ప్రసాద్ (22) సోనియా (20)అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా సిమెంట్ లోడుతో వైజాగ్ వైపు వెళ్తున్న లారీ టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలు ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. స్కూటీ ముక్క ముక్కలుగా జాతీయ రహదారిపై పడింది. ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఇరువురికి మూడు నెలల పాప. ఈ ఘటన నందరాడ గ్రామంలో కుటుంబంలో విషాదం నెలకొంది.

ముక్కుపచ్చలారని మూడు నెలల పాపను వదిలి భార్యాభర్తలు అనంత లోకానికి వెళ్లిపోయారు. ఘటన స్థలానికి రాజానగరం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ క్లీనర్ పరారయ్యారని వారి కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి