ఫస్ట్ సినిమాలోనే రెచ్చిపోయింది.. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ డమ్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్..
సాధారణంగా సినీరంగంలో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన తారలు.. ఆ తర్వాత వరుస సినిమాలతో తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం బోల్డ్ అరంగేట్రంతో రాత్రికి రాత్రే సంచలనంగా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? 2003లో హిందీ సినిమా ప్రపంచంలోకి ఒక కొత్త ముఖం అడుగుపెట్టింది. తొలి చిత్రంలో బోల్డ్ సీన్లతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. దీంతో అప్పట్లో ఆమె పేరు మారుమోగింది. సినీరంగంలోకి సాహసోపేతమై కొత్త ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మల్లికా షెరావత్.. ఈ పేరుకు ఒకప్పుడు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీని ఏలిన తారలలో ఆమె ఒకరు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‌లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
మల్లికా షరావత్.. 2003లో ఖ్వాహిష్ సినిమాతో హిందీ మూవీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఈ సినిమాలో దాదాపు 17 ముద్దు సన్నివేశాలు ఉన్నాయట. దీంతో అప్పట్లో ఆమె పేరు మారుమోగింది. మరోవైపు ఫస్ట్ మూవీకే తనపై విమర్శలు రాగా.. కథ డిమాండ్ చేయడం.. పాత్రకు తగినట్లుగా నటించడమే తన వృత్తి అని తెలిపింది. ఖ్వాహిష్‌లో చూపించిన ధైర్యం ఆమె తదుపరి పెద్ద విజయానికి మార్గం సుగమం చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ మర్డర్. ఇమ్రాన్ హష్మీ, అష్మిత్ పటేల్ జంటగా నటించిన ఈ సినిమా 2004లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
ఆ తర్వాత హిందీలో షాది సే పెహ్లే, కిస్మత్ లవ్ పైసా దిల్లీ వంటి సినిమాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఒకప్పుడు బోల్డ్ చిత్రాలు, స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఊపేసిన మల్లికా… ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ హీరోయిన్.. ఇటీవల రాజ్‌కుమార్ రావు, త్రిప్తి దిమ్రీ కలిసి నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‌లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..




